సినిమా అట్టర్ ప్లాప్.. ఇద్దరు కొడుకులను పోగొట్టుకున్న నటుడు!

బాలీవుడ్ స్టార్ హీరో అయిన ఫిరోజ్ ఖాన్ వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు ఫర్దీన్ ఖాన్.

తన కెరీర్ ప్రారంభంలోనే స్టార్ హీరోగా నిలదొక్కుకొనే ప్రయత్నాలు చేశాడు.

కానీ వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్ గా చాలా సమస్యలు అతనిని దారుణంగా దెబ్బతీశాయి.దీనితో తీవ్ర స్థాయిలో అతడు మద్యానికి అలవాటు పడ్డాడు.

మద్యానికి అలవాటు పడడంతో ఒకవైపు ఆరోగ్యపరంగా, మరొకవైపు కెరీర్ పరంగా దారుణమైన ఇబ్బందులను ఎదుర్కొన్నాడు.అయితే దారుణమైన పరిస్థితికి పడిపోయిన ఫర్దీన్ ఖాన్ మళ్లీ నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఈ క్రమంలోనే దాదాపుగా వందకుపైగా కిలోల బరువు ఉన్న అతను బరువు తగ్గి మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నాడు.ఇక ఇటీవల సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన జీవితంలో చోటుచేసుకున్న చేదు అనుభవాల గురించి వెల్లడించారు.ప్రస్తుతం ఫర్దీన్ ఖాన్ రితేష్ దేశ్ ముఖ్, ప్రియా బాపట్, క్రిస్టల్ డి సౌజా తో కలసి విస్పోట్ ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు.

Advertisement

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా బిజీ బిజీగా గడుపుతున్నాడు.తనకు ప్రేమ్ అగన్ సినిమా రిలీజ్ సమయంలో తనకు అన్నీ చేదు అనుభవాలు ఎదురయ్యాయి అని తెలిపాడు.

ప్రెగ్నెన్సీ సమయంలో తన భార్యకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు తన భార్య గర్భంలో పెరుగుతున్న ఇద్దరు కవలలు ఆరునెలల సమయంలోనే మరణించాడు అని తెలిపాడు.ఆ విషయం పట్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యాను అని చెప్పుకొచ్చాడు.అలాంటి బాధాకరమైన సమయంలో అవార్డు లభించిన కూడా తాను దానిని అంగీకరించలేక పోయాను అని చెప్పుకొచ్చాడు ఫర్దీన్ ఖాన్.

ఇక ప్రేమ్ అగన్ సినిమా ప్లాప్ ఏడాదిపాటు గా ఇంటిపట్టునే ఉన్నాను అని తెలిపాడు.అంతేకాకుండా నిర్మాతల దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేశాడట.ఆ సమయంలో చేతిలో డబ్బులు లేకుండా పని లేకుండా సినిమాలు లేకుండా జీవితం చాలా దుర్భరంగా గడిచింది అని చెప్పుకొచ్చారు.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు