టాలీవుడ్ నటుడు బబ్లూ పృథ్వీరాజ్ గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.ఈ వయసులో పృథ్వి 23 ఏళ్ల అమ్మాయిని రెండో పెళ్లి సీక్రెట్ గా చేసుకున్నాడు అంటూ దుర్గా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న పృథ్వి 23 ఏళ్ల మలేషియా అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు వార్తలు కొడుతున్నాయి.తాజాగా ఈ వార్తలపై పృథ్వి స్పందించారు.
తన రెండవ భార్య వయసు 23 ఏళ్లు కాదని 24 ఏళ్లు అని క్లారిటీ ఇచ్చాడు.
అంతేకాకుండా సోషల్ మీడియాలో వినిపిస్తున్న విధంగా ఆమె మలేషియా అమ్మాయి కాదని తెలుగమ్మాయి అని స్పష్టం చేశాడు.
అంతేకాకుండా ప్రేమ ఏ వయసులో పుడుతుందో చెప్పలేము ప్రేమ పెళ్లికి వయసు సంబంధం లేదు అని చెప్పుకొచ్చాడు పృథ్వీరాజ్.పృథ్వీరాజ్ 28 ఏళ్ల క్రితమే బీనా అనే యువతని పెళ్లి చేసుకున్నాడు.
ఆ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు.అతని వయసు ప్రస్తుతం 27 సంవత్సరాలు.
అయితే తన భార్యతో వస్తున్న గొడవల కారణంగా తనకు భార్యకు దూరంగా ఉంటున్నానని, నెలకు ఒకసారి తన కొడుకును కలుస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు పృథ్వీరాజ్.

కాగా తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 24 ఏళ్ల తెలుగు అమ్మాయి శీతల్ తో ప్రేమలో పడ్డాను అని,ఆమెతో కలిసి సహజీవనం కూడా చేస్తున్నట్టు వెల్లడించాడు పృథ్వి.నాకు ప్రస్తుతం 56 సంవత్సరాలు ఆ అమ్మాయికి 24 ఏళ్లు అయినప్పటికీ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఆమె సిద్ధంగా ఉంది.మొదట నేను పెళ్ళికి ఒప్పుకోకుండా ఆమెకు సమయం ఇచ్చాను కానీ ఆమె నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది అందుకు ఆమె ఫ్యామిలీ కూడా ఒప్పుకుంది.
ఇక రెండు నెలల క్రితం నా మొదటి భార్యకు విడాకులు ఇచ్చాను.నా రెండవ భార్య నిన్ను బాగా చూసుకుంటుంది అన్న నమ్మకం నాకు ఉంది.అంతేకాకుండా నా రెండవ భార్యతో బిడ్డను కూడా కనాలని ఉంది అంటూ తన మనసులోని మాటను వెల్లడించాడు పృథ్వి.విషయంపై పలువురు నెటిజెన్స్ స్పందిస్తూ పృథ్వీరాజ్ ని తిట్టిపోస్తున్నారు.
అతనిపై తీవ్రస్థాయిలో మండిపడుతూ ట్రోలింగ్స్ కూడా చేస్తున్నారు.







