సూపర్ స్టార్ రజనీ కాంత్( Rajinikanth ) గురించి ఇండియన్ వైడ్ గా ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పని లేదు.70 ఏళ్ళు దాటినా కూడా ఇప్పటికి ఈయన వరుస సినిమాలు చేస్తూ ఆడియెన్స్ ను అలరిస్తున్నాడు.ప్రజెంట్ రజనీకాంత్ చేస్తున్న సినిమా ”జైలర్”.( Jailer Movie ) ఈ మధ్య కాలంలో రజనీకాంత్ సినిమాల్లో ఇంత హైప్ ఏర్పరుచుకున్న సినిమా ఇదే కావడం విశేషం.
కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.ఈ సినిమాలో రజినీకాంత్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.
సన్ పిక్చర్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది.ఇదిలా ఉండగా నెక్స్ట్ సినిమాను రజినీకాంత్ లోకేష్ కనకరాజ్( Lokesh Kanakaraj ) దర్శకత్వంలో చేస్తున్నట్టు టాక్.
లోకేష్ విక్రమ్ సినిమాతో మూవీ లవర్స్ కి సరికొత్త సినిమా యూనివర్స్ ను పరిచయం చేసి ఆ తర్వాత సూపర్ హిట్ కాంబోలను సెట్ చేసుకుంటున్నాడు.లోకేష్ ప్రస్తుతం విజయ్ దళపతి తో లియో సినిమా( Leo Movie ) చేస్తున్నాడు.ఈ సినిమా పూర్తి అవ్వగానే రజినీకాంత్ తో సినిమా చేయనున్నట్టు తెలుస్తుంది.మరి తాజాగా ఈ సినిమా మరో ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది.
ఈ సినిమాపై వస్తున్న వార్తల ప్రకారం ప్రస్తుతం లియో సినిమాలో నటిస్తున్న యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా రజినీ సినిమాలో కూడా నటిస్తాడని అంటున్నారు.ఇదే నిజమైతే తన యూనివర్స్ లో ఈ సినిమాతో కూడా ఈ రకంగా లింక్ ఉంటుంది అని టాక్.రజినీ కాంత్ సినిమాలో కూడా అర్జున్ విలన్ రోల్ లోనే నటిస్తున్నట్టు టాక్.చూడాలి ఈ కాంబో ఎంత వరకు వర్కౌట్ అవుతుందో.