మెగాస్టార్ చిరంజీవి 152 వ సినిమా గా ఆచార్య తెరకెక్కుతుంది.ఈ సినిమాను కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కి స్తున్నాడు.
ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో ‘సిద్ద’ అనే పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు.
ఇందులో రామ్ చరణ్ కు జోడీగా పూజ హెగ్డే నటిస్తుంది.వీరిద్దరూ సినిమాలో కొద్దీ సేపే కనిపించ బోతున్నప్పటికీ వీళ్ళ పాత్రలు సినిమాకే హైలెట్ గా ఉండబోతున్నాయని సమాచారం.
ఈ సినిమా మే 13 న విడుదల అవ్వబోతుందని ప్రకటించినప్పటికీ ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితి వల్ల ఈ ఆచార్య సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ అవ్వలేని పరిస్థితి ఏర్పడింది.అందుకే ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు ఈ రోజు అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమా షూటింగ్ ఇంకా బాలన్స్ ఉంది.ఇప్పట్లో షూటింగ్ జరిగే పరిస్థితులు కూడా లేవు.
అందుకే ఈ సినిమా రెండు నెలలు టైం తీసుకుని చిరంజీవి పుట్టిన రోజుకు వచ్చే సూచనలు ఉన్నాయంటూ ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.ఇంకా గట్టిగ 10 రోజులు షూటింగ్ చేస్తే ఈ సినిమా పూర్తి అవుతుందని లేటెస్ట్ గా వినిపిస్తున్న బజ్.ఎలాగైనా జూన్ లో ఈ 10 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేసి పూర్తి చేసి మెగాస్టార్ పుట్టిన రోజుకు విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తుంది.
అది కూడా కుదరకపోతే మళ్ళీ దసరా కానుకగా విడుదల చేయాలనీ మేకర్స్ ఆలోచన.
అప్పటిలోగా కరోనా సెకండ్ వేవ్ కొద్దిగా తగ్గుముఖం పడితే మిగిలిన కొద్దీ షూటింగ్ పూర్తి చేసి విడుదల చేయాలనీ భావిస్తున్నారు.మరి చూడాలి వీళ్ళ ప్లాన్ ఎంతవరకు వర్క్ అవుతుందో.
ఈ సినిమాను కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.