నెటిజన్ పై ఫైర్ అయిన అభిషేక్.. ఐశ్వర్యను అలా అనడంతో..?

బాలీవుడ్ క్యూట్ కపుల్స్ లో ఐశ్వర్య అభిషేక్ జంట ఒకటనే సంగతి తెలిసిందే.

ఐశ్వర్యా రాయ్ హీరోయిన్ గా నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కాగా అభిషేక్ బచ్చన్ నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం ఫ్లాపులు ఉన్నాయి.

ఐశ్వర్యా రాయ్ స్టార్ హీరోయిన్ గా అన్ని భాషల్లో గుర్తింపును సంపాదించుకుంటే అభిషేక్ బచ్చన్ మాత్రం కెరీర్ లో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు.అయితే తాజాగా ఒక నెటిజన్ ఐశ్వర్య రాయ్ ను సౌందర్య రాశితో పోల్చి అభిషేక్ ను మాత్రం అవమానించేలా కామెంట్లు చేశారు.

ఒక నెటిజన్ తన దృష్టిలో అభిషేక్ బచ్చన్ చాలా విషయాల్లో బాగుంటారని.కానీ తనకు అభిషేక్ బచ్చన్ ను చూస్తే ఒక విషయంలో మాత్రం ఎంతో ఈర్ష్య కలుగుతోందని.

అభిషేక్ బచ్చన్ కు ఐశ్వర్యా రాయ్ రూపంలో చాలా బాగుండే భార్య దొరికిందని.అంతటి అందమైన అమ్మాయిని పొందే అర్హత మీకు లేదని అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

అయితే భార్యను పొగుడుతూ తనను అవమానించేలా మాట్లాడటంపై అభిషేక్ బచ్చన్ సీరియస్ అయ్యారు.నెటిజన్ అభిప్రాయానికి తాను ధన్యవాదాలు చెబుతున్నానని.

క్యూరియాసిటీ కొద్ది నువ్వు ఈ విధంగా అడుగుతున్నావని తనకు తెలుసని.నువ్వు ట్యాగ్ చేసిన వాళ్లలో చాలామంది పెళ్లి కాని సెలబ్రిటీలు కూడా ఉన్నారని.

ఆ సెలబ్రిటీలలో కొంతమందితో తనకు పరిచయం కూడా ఉందని.మరి నా గురించి ఇలా కామెంట్ చేయడానికి నీకు ఉన్న అర్హత ఏమిటని అభిషేక్ బచ్చన్ నెటిజన్ కు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చారు.

ట్రోలింగ్ చేసే వాళ్ల పట్ల అభిషేక్ బచ్చన్ వ్యవహరించిన తీరును ఇతర నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.ప్రస్తుతం అభిషేక్ బిగ్ బుల్ అనే సినిమాలో నటిస్తున్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఏప్రిల్ నెలలో ఈ సినిమా విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు