సురేష్ బాబు చిన్న కొడుకు హీరోగా రెడీ... రవిబాబు దర్శకత్వంలో

రామానాయుడు వారసులలో ఒకరైన విక్టరీ వెంకటేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

ఇక పెద్ద కొడుకు సురేష్ బాబు నిర్మాతగా సురేష్ ప్రొడక్షన్స్ బాధ్యతలు చూసుకుంటున్నారు.

ఇప్పుడు సురేష్ బాబు వారసులుగా రానా ఇప్పటికే హీరోగా తెరంగేట్రం చేసి తనదైన నటనతో దూసుకుపోతున్నాడు.ఇక ఇప్పుడు చిన్న కొడుకు అభిరామ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే నటనలో శిక్షణ తీసుకున్న అభిరామ్ ఓ వైపు తెరంగేట్రం కోసం ఎదురుచూస్తూ మరో వైపు ప్రొడక్షన్ బాద్యతలు చూసుకుంటున్నాడు.ఇప్పుడు నటుడుగా అతని ఎంట్రీ కోసం సురేష్ బాబు దర్శకుడుని ఫైనల్ చేసేశాడు.

క్రియేటివ్ టాలెంటెడ్ దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న రవిబాబు దర్శకత్వంలో కొడుకుని పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే రవిబాబు అభిరామ్ కోసం ఓ ఇంటరెస్టింగ్ స్టొరీ ని రెడీ చేసినట్లు బోగట్టా.

Advertisement

రెగ్యులర్ జోనర్ మూవీ కాకుండా తన స్టైల్లో ఓ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో అభిరామ్ ని రవిబాబు పరిచయం చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ జరుగుతుందని త్వరలో అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందనే మాట బలంగా వినిపిస్తుంది.

శ్రీరెడ్డి ఇష్యూలో అభిరామ్ ఒక్కసారిగా మీడియా దృష్టిలో పడ్డాడు.ఇప్పుడు అతని ఎంట్రీ ఇలా ఉండబోతుంది అనేది హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు