పంజాబ్‌లో గెలవడమే లక్ష్యమట...!

ఈ మాట చెప్పింది జాతీయ పార్టీలు కాదు.దీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న పార్టీలు కాదు.

మూడేళ్ల క్రితం పుట్టిన పార్టీ.ఈ ఏడాది ఢిల్లీలో అధికారం కైవసం చేసుకున్న పార్టీ తన లక్ష్యం గురించి చెప్పింది.

ఆ పార్టీ ఏదో తెలుసు కదా.ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌).రెండు వేల పదిహేడో సంవత్సరంలో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.

ఢిల్లీకి దగ్గర్లోనే ఉన్న పంజాబ్‌లో పాగా వేయాలని ఆప్‌ కలగంటోంది.ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా ఆప్‌ ఇప్పటినుంచే సిద్ధమవుతోందదని అది చేసిన ప్రకటన బట్టి అర్థమవుతోంది.

Advertisement

మేం పంజాబ్‌ ఎన్నికల్లో చేసి గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.గరిష్టస్థాయిలో మెజారిటీ సాధించి అధికారంలోకి రావాలనుకుంటున్నాం అని ఆప్‌ ప్రతినిధి చెప్పారు.

ప్రస్తుతం ఆప్‌ సంక్షోభంలో ఉంది.పార్టీ ముక్కలైంది.

పార్టీ వ్యవస్థాపకుల్లో కొందరు కొత్త పార్టీ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు.ఈ దశలో పంజాబ్‌లో గెలవడమే తమ లక్ష్యమని ఆప్‌ ప్రకటించడం వెనక మేం బలహీనపడలేదు అని ప్రజలకు తెలియచెప్పే ప్రయత్నమన్నమాట.

ప్రస్తుతం ఈ పార్టీకి పంజాబ్‌ నుంచి నలుగురు ఎంపీలున్నారు.పంజాబ్‌లో ఆప్‌కు ఉన్న ఆదరణ గురించి తెలుసుకోవడానికి, బలం గురించి అంచనా వేయడానికి నలుగురు సభ్యుల బృందం సర్వే చేస్తోంది.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
ఈ దశలో గాజు గ్లాసు గుర్తు మార్చలేం తేల్చి చెప్పిన ఈసీ..!!

పంజాబ్‌లో గెలిచినా, గెలవకపోయినా లక్ష్యం నిర్దేశించుకొని ఇప్పటినుంచే పనిచేస్తున్న ఆప్‌ను అభినందించాలి.

Advertisement

తాజా వార్తలు