విజయవంతంగా ముగిసిన విదేశీ పర్యటన

రాజన్న సిరిసిల్ల జిల్లా :విదేశీ (దుబాయ్) పర్యటన( Dubai tour ) విజయ వంతంగా ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్( Aadi Srinivas ) కు శనివారం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు సాల్వతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

గల్ఫ్ లో వేములవాడ నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుకొని వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తారనే నమ్మకం ఉందన్నారు జరిగిన ఎలక్షన్ లో గల్ఫ్ లో ఉండి పరోక్షంగా పని చేసినా గల్ఫ్ సోదరులకు కృతజ్ఞతలు తెలిపి వచ్చిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు కథలాపూర్ మండ ల కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు తొట్ల అంజయ్య( Anjaiah ), మండల అధ్యక్షులు కాయితి నాగరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి అజీమ్,చేనేత రాష్ట్ర అధ్యక్షులు పులి హరి ప్రసాద్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెలిచాల సత్యనారాయణ, మాజీ మండల అధ్యక్షులు చెదలు సత్యనారాయణ, తలారి మోహన్, కూన అశోక్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్ల ప్రభుత్వ స్కూల్ విద్యార్ధి హేమంత్ ప్రతిభకు గుర్తింపు

Latest Rajanna Sircilla News