200 అడుగుల పైనుంచి దూకిన యువకుడు.. వీడియో చూస్తే షాకే..!

ఏదో ఒక ప్రపంచ రికార్డు సృష్టించాలని డైలీ ప్రజలు ప్రమాదకరమైన, సాహసోపేతమైన స్టంట్స్ చేస్తుంటారు.

అయితే వీరి స్టంట్స్ అద్భుతంగా ఉంటే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన బుక్‌లో చోటు కల్పించడం సహజం.

అయితే తాజాగా ఒక వ్యక్తి చేసిన ఆశ్చర్యకరమైన స్టంట్ కు సంబంధించిన వీడియోని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది.ఈ వీడియోలో వీరోచితమైన స్టంట్ చేసిన రాన్ జోన్స్ అనే ఒక యువకుడిని మీరు చూడొచ్చు.

ఒక కప్పు కాఫీలో డోనట్‌ను ముంచడం కోసం అత్యధిక బంగీ జంప్ (198 అడుగులు) చేసిన యువకుడిగా రాన్ జోన్స్ కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పేర్కొంది."యూఎస్‌కు చెందిన రాన్ జోన్స్ డోనట్ (బంగీ జంపింగ్) 60.553 మీటర్లు (198 అడుగుల 8 అంగుళాలు) అత్యధిక డంక్" అని వీడియోకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఒక టైటిల్ యాడ్ చేసింది.ఈ వీడియోలో మిస్టర్ జోన్స్ పైన కట్టిన తాడును నుంచి బంగీ జంప్‌కు రెడీ అవ్వడం చూడొచ్చు.

అనంతరం క్షణాల్లోనే అతడు జంప్ చేసి తన చేతిలోని డోనట్‌ను కాఫీ లో ముంచేశాడు.జోన్స్ 198 అడుగుల దిగువన ఉన్న టేబుల్‌పై ఉంచిన ఒక కప్పు కాఫీకి చేరుకొని తన డోనట్‌ను మంచి డాన్స్ చూసి అక్కడున్న వారంతా వావ్ అంటూ ఆశ్చర్యపోయారు.

Advertisement

సాధారణంగా దాదాపు 200 అడుగుల ఎత్తు పై నుంచి దూకినప్పుడు కళ్ళు తిరుగుతాయి.ఒకే సారి కిందికి రాగానే భయం కూడా వేస్తోంది.ఈ సమయంలో ఎవరు కూడా ఎలాంటి పనులను చేయలేరు కానీ జోన్స్ మాత్రం పూర్తి ఏకాగ్రతతో కాఫీ లో డోనట్ ముంచి ఆశ్చర్యపరిచాడు.

ఈ వీడియోకి 7 లక్షలకు పైగా వ్యూస్‌ లక్ష వరకు లైకులు వచ్చాయి.జోన్స్ డేర్‌డెవిల్‌ స్టంట్ కు నెటిజన్లు అబ్బురపడుతున్నారు.

మరికొందరు ఇది అమేజింగ్, ఇన్‌క్రిడిబుల్ స్టంట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.ఈ వీడియోని మీరు కూడా వీక్షించండి.

చిరంజీవి విలన్ గా బాలీవుడ్ నటుడు..  మేకర్స్ పోస్ట్ వైరల్!
Advertisement

తాజా వార్తలు