ఉబర్ డ్రైవర్ కూతురికి స్కూల్ బ్యాగ్ కొనిచ్చిన అపరిచితుడు.. నెటిజన్లు ఫిదా..

సామాజిక కార్యకర్త, రక్తదాన వేదిక "సింప్లీ బ్లడ్" వ్యవస్థాపకుడు కిరణ్ వర్మ( Kiran Verma) ఇటీవల మానవత్వంపై మనకున్న నమ్మకాన్ని మరింత బలపరిచే ఒక అద్భుతమైన సంఘటనను పంచుకున్నారు.

రీసెంట్ గా కిరణ్ వర్మ ఒక ఉబర్ క్యాబ్‌లో ప్రయాణిస్తున్నారు.

ఆ సమయంలో, ఆయన గమనించిన ఒక విషయం ఆయనను ఆలోచింపజేసింది.ఆ ఉబర్ డ్రైవర్ ( Uber driver)తన ఫోన్‌కు వస్తున్న కాల్స్‌ని ఎందుకో విస్మరిస్తూ ఉన్నాడు.

దీంతో ఆందోళన చెందిన అతను, అత్యవసరంగా కాల్ చేస్తే ఆన్సర్ చేయాలని డ్రైవర్‌ను కోరాడు.

అప్పుడు ఆ డ్రైవర్ కొంచెం తడబడుతూ చెప్పడం మొదలుపెట్టాడు.తన చిన్న కుమార్తె ఒక కొత్త స్కూల్ బ్యాగ్ కోసం అడుగుతున్నట్లు చెప్పాడు.అయితే, ఇటీవలే ఆమెకు కావాల్సిన పుస్తకాలు కొనుగోలు చేశానని, నెలవారీ బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉన్నందున వెంటనే కొత్త బ్యాగ్ కొనలేనని వివరించాడు.

Advertisement

ఈ విషయం తెలుసుకున్న కిరణ్ వర్మ చాలా కదిలిపోయారు.ఆ చిన్నారి కోరిక తీర్చాలని నిర్ణయించుకున్నారు.వెంటనే ఒక కొత్త స్కూల్ బ్యాగ్ కొనుగోలు చేసి, ఆ డ్రైవర్ కుమార్తెకు అందించారు.

ఆ చిన్నారి ఆనందానికి అంతులేదు.ఆమె కిరణ్ వర్మకు చాలా కృతజ్ఞతలు తెలిపింది.ఈ బ్యాగ్ ను కొనడానికి వర్మ తన పికప్ లొకేషన్‌ని మార్చారు.

తనను ఒక షాప్‌కి తీసుకెళ్లమని ఉబర్ డ్రైవర్‌ని అడిగారు.ఇద్దరూ కలిసి స్కూల్ బ్యాగ్‌ని ఎంపిక చేసుకున్నారు.

తన వద్ద తగినంత డబ్బు లేకపోవడంతో వర్మ మనీ చెల్లించారు.డ్రైవర్ అతనికి కృతజ్ఞతలు తెలిపాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
వైరల్ వీడియో : పాఠాలు వింటూనే గుండెపోటుకు గురైన చిన్నారి.. చివరకి?

వర్మతో తన ఫోన్ నంబర్‌ను పంచుకున్నాడు.అదేరోజు ఆ డ్రైవర్ తన కూతురు ఆనందంగా కొత్త బ్యాగ్ పట్టుకుని ఉన్న ఫోటోని వర్మకు పంపించాడు.

Advertisement

కష్ట సమయాల్లో కూడా తమ పిల్లలను నిరాశపరచని తండ్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.వాట్సాప్‌లో షేర్ చేయడానికి ముందు వర్మ ఫోటోను బ్లర్ చేశారు.

ఈ అనుభవం గురించి వర్మ ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా నేటిజన్లతో పంచుకున్నారు.దీనికి లక్షల్లో వ్యూస్ వేలల్లో లైక్స్ వచ్చాయి.ఈ లింకు https://www.facebook.com/share/p/fepvYzG2yjCdwBFW/?mibextid=xfxF2iపై క్లిక్ చేయడం ద్వారా ఆ పోస్ట్ ను చూడవచ్చు.

తాజా వార్తలు