రావణాసుర లాంటి కథ ఇప్పటివరకు రాలేదు... డైరెక్టర్ సుధీర్ వర్మ కామెంట్స్ వైరల్!

మాస్ మహారాజ రవితేజ( Raviteja ) వరుస సినిమాలతో ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.

ధమాకా సినిమా( Dhamaka Movie )తో బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ తాజాగా రావణాసుర( Ravanasura ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా ఏప్రిల్ ఏడో తేదీ విడుదల కానుంది.ఇలా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.

ఇక ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహించగా అభిషేక్ నామా, రవితేజ ఇద్దరు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.ఇక ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో డైరెక్టర్ సుధీర్ వర్మ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Advertisement

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ రవితేజ గారితో ఫలానా జానర్ లో సినిమా చేయాలని తాను ఎప్పుడూ అనుకోలేదు అయితే రైటర్ శ్రీకాంత్ చెప్పిన రావణాసుర సినిమా కథ రవితేజ గారికి నచ్చడంతో ఈ సినిమాకు తాను డైరెక్టర్ అయితే బాగుంటుందని భావించిన రవితేజ తనని కలవమని చెప్పారని సుధీర్ వర్మ తెలియజేశారు.ఇక ఈ సినిమాపై పూర్తి నమ్మకం ఉండడంతో ఆయన నిర్మాతగా వ్యవహరించారని తెలియజేశారు.

థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన రావణాసుర సినిమా పూర్తిగా 100% కొత్త సినిమా ఇలాంటి సినిమాలు ఇప్పటివరకు తెలుగులో ఎక్కడ రాలేదని ఈయన తెలియజేశారు.ఇక డైరెక్టర్ మణిరత్నం( Maniratnam ) గారు దర్శకత్వంలో తెరకెక్కిన రావణ్ సినిమా( Ravan Movie ) కు మా రావణాసుర సినిమాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదని ఈయన తెలియజేశారు.ఇక ఈ సినిమాని పలు భాషలలో కూడా విడుదల చేయాలని భావించాము అయితే కుదరలేదని తెలుగులో విడుదలైన తర్వాత రెండు వారాలకు హిందీలో( Hindi ) విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నామని డైరెక్టర్ తెలిపారు.

ఇలా రావణాసుర సినిమా గురించి సుదీర్ వర్మ చేసినటువంటి ఈ కామెంట్స్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేశాయి.మరి రావణాసుర సినిమా ద్వారా మాస్ హీరో ఏ విధమైనటువంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు