ఈ భూమి ఆకాశము సూర్య చంద్రుల పుట్టిన నాటి నుండి ఈ ప్రపంచంలో "ఓం" అనే శబ్దం పుట్టింది అని మన మహర్షులు చెబుతుంటారు .
అది కాలాంతరముగా "ఓం కారం" అయింది .
ఆ ఓం కారమే, అది దేవుడైన పరమ శివుడిని అని మన ఇష్ట దైవంగా పూజించుకుంటున్నాం.ఆ మహా శక్తివంతుడైన పరమ శివుడిని ప్రతి సవంత్సరము మహా శివరాత్రి పండుగ గా జరుపుకుంటున్నాం.
ఈ భూప్రపంచం పుట్టినప్పటి నుంచి పురాణ కాలం నుండి ఇప్పుడు వరకు మన ధర్మ శాస్త్రాల ప్రకారం మనిషి జీవించే కాలం ను నాలుగు యుగాలుగా విభజించారు 1.కృతా యుగం 2.త్రేతా యుగం 3.ద్వాపర యుగం 4.కలి యుగం గా చెప్పబడినవి .ఈ పైన చెప్పిన అన్ని యుగములోను ఈ శివరాత్రి జరుపుకుంటున్నట్లుగా అప్పటి మహర్షలు ,ఇప్పటి వేద పండితులు కూడా చెబుతుంటారు .నాలుగు యుగములలో కృత యుగములో బంగారు యుగంగా చెబుతుంటారు .త్రేతా యుగంలో శ్రీ రాముడు సీతా దేవి శివుడిని పూజించుచున్నట్టుగా కొన్ని మనకి ఆధారాలు మహర్షుల చే చెప్పబడినది.ద్వాపర యుగం లో అర్జునుడు కూడా శివుడిని తపస్సు ద్వారా పూజించి పాసు పతాస్త్రం పొందినట్లు ద్వాపర యుగంలో చెబుతుంటారు .
కలియుగంలో శివుడిని పండిత పామరులు ఈ కలి యుగంలో వారికి తెలిసిన విధముగా ఒక్కక్కొరు , ఒక్కొక్క ,ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పూజించడం జరుగుతుంది.శ్రీ శైలంలో మల్లన్న గా ,శ్రీ కాల హస్తి లో శ్రీకాళహస్తీశ్వరుని గా ,కాశీ విశ్వేశ్వరుని గా అలా చెప్పుకుంటూ వెళ్ళితే అనేక పేర్లు ఉన్నాయి.అయన మన భారత దేశంలో ఇప్పటికి 12 జ్యోతిర్లింగాలుగా ఉన్నాయి 1 గుజరాత్ రాష్ట్రం - సోమనాధ జోతిర్లింగం 2.
ఆంధ్రప్రదేశ్ - శ్రీశైలం మల్లికార్జున స్వామి జోతిర్లింగం 3.మధ్యప్రదేశ్ ఉజ్జయినీలోని - మహాకాళేశ్వర్ జోతిర్లింగం 4.మధ్యప్రదేశ్ లో నర్మదా నది ద్వీపంలో ఉన్న ఓంకారేశ్వర్ జోతిర్లింగం 5.
మహరాష్ట్రలోని - వైద్యనాథ్ జోతిర్లింగం 6.మహారాష్ట్రలోని శ్రీనాగనాథేశ్వర జోతిర్లింగం 7తమిళనాడులోని రామేశ్వర జ్యోతిర్లింగం 8.
ఉత్తరాంచల్ - కేదార్నాథ్ జోతిర్లింగం 9.మహారాష్ట్ర నాసిక్ లోని - ట్రింబకేశ్వర్ జోతిర్లింగం 10 మహారాష్ట్ర - భీమశంకర్ జోతిర్లింగం 11 మహారాష్ట్ర ఔరంగబాద్ లోనిశ్రీ ఘృష్ణేశ్వర జోతిర్లింగం 12.
విశ్వేశర జోతిర్లింగం-వారణాసి-ఉత్తర్ ప్రదేశ్ ఇప్పటికి ఈ కలి యుగంలో పైన చెప్పిన పేర్లతో స్వామి వారిని భక్తులు పూజించుకుంటారు కలి యుగం లో పామరుడు అయిన తిన్నడు అడవుల్లో వేటాడి జీవనం సాగించే వాడు ,దైవాన్ని ధూషించుకుంటూ తిరిగే వాడు .తన భార్య అయిన నీల దైవమైన శివుని గురుంచి తిన్నడు కు చెబుతూ ఉండేది కానీ తిన్నడు ఆమె మాటలను పట్టించు కోలేదు ,కానీ ఒక రోజున తిన్నడు వేటకు వెళితే ఆయనకు వేట లో ఆయనకు ఏ విధమైన ఆహారం లభించలేదు ,ఆకలి బాధ చూడలేని పార్వతి దేవి శివుడిని ప్రశ్ననిస్తుంది .ఈ శివరాత్రి పర్వ దినమున నీ భక్తురాలి భర్త ఇలా ఆకలి తో అలమటించవలయునా స్వామి అని ప్రశ్నించగా శివుడు ఆ తిన్నడు యొక్క పూర్వ జన్మ గురుంచి చెప్పడం జరుగుతుంది .అప్పుడు శివుడు మారు వేషంలో తిన్నడు దగ్గరకు వెళ్లి పరామర్శించడం జరుగుతుంది .అప్పుడు అయానే శివుడు అని గ్రహించలేని తిన్నడు .శివుడిని ద్వేషించడం జరుగుతుంది.అప్పటికి శివుడు తిన్నడు కు భక్తి అనే జ్ఞానాన్ని బోధిస్తాడు ,కానీ తిన్నడు తెలుసుకోలేడు .ఆ పరమ శివుడు తన భక్తురాలైన నీల దగ్గరకు వెళ్లి నీ భర్త నీకుఇవ్వమన్నాడు అని కొన్ని ఆహార ద్రవ్యముల మూటను ఆమె కు ఇచ్చి ,నీ భర్త ఆకలితో ఉన్నాడు త్వరగా భోజనము తీసుకు వెళ్లి అని చెప్పి ఆ పరమ శివుడు అక్కడ నుంచి అదృశ్యం అవ్వడం జరుగుతుంది.
నీల స్వామి ఇచ్చిన ఆహార ద్రవ్యములతో వంట చేసుకొని త్వరగా తిన్నడు దగ్గరకు చేరుకుంటుంది .అది చూసిన తిన్నడు నీల ను ఎక్కడిది ఈ భోజనము అని ప్రశ్నించగా ఆ పెద్ద మనిషి అయినా శివయ్య నీవే ఇచ్చావు అని ఒక ఆహార ద్రవ్యాల మూటను నాకు ఇచ్చి ,నీవు ఆకలి బాధతో ఉన్నావు అని చెప్పి ఆ పెద్ద మనిషి వెళిపోయాడు .అది విన్నతిన్నడు నా దగ్గరకు వచ్చిన పెద్దమనిషి శివుడు అని గ్రహించి నీల కు చెప్పి బాధ పడతాడు ఆ రోజు నుండి శివుడే తన ప్రాణం అని తన దేహం అని ఆ పరమ శివుడిని కొలుస్తుంటాడు .కానీ ఒక రోజున ఆయన పూజించే సమయంలో శివ లింగం నుంచి ఒక కన్నులో నుండి రక్తం కారడం చూసి తిన్నడు తన కన్నుతీసి శివుడి కి పెడతాడు అది పెట్టిన కొన్ని నిమిషాలకే రెండొవ కన్ను నుండి రక్తం కారడం మొదలైవుతుంది .తిన్నడు తన రెండవ కన్ను ని కూడా పెడుతుండగా అది చూసిన పరమ శివుడు తన భక్తి కి మెచ్చి దర్శన మిస్తారు ఇలా మన జీవితంలో తిన్నాడు వంటి మాహా భక్తులు ఎందరో ఉన్నారు .ముగా జీవాలైన ఏనుగు , సాలి పురుగు ,పాము , కూడా శివుడిని పూజించి నట్టు మన పురాణాల్లో చెబుతున్నారు .ఈ విధంగా చెప్పా బడినా ప్రదేశమే ఈ రోజున శ్రీకాళ హస్తీశ్వరుడి గా , శ్రీ కాలహస్తి గా పిలుస్తున్నాం ." ఈ శ్రీకాలహస్తి చరిత్రను అలనాటి రాయలు వారి ఆస్థానంలో ఉన్న అష్ట దిగ్గజ కవులైన ధూర్జటి రచించడం జరిగింది ".ఇక చివరిగా శివయ్య ,శంకరా సాంబయ్య ఏ పేరుతో పిలిచినా శివుడు తన భక్తులను కోరికలు తీరుస్తాడు అని విశ్వసిస్తారు .అందుకే శివుడిని మన భోళా శంకరుడు అని కూడా అంటారు .ఇక ఈ మహా శివరాత్రి పండుగ ముఖ్యమైన విశేషం ఏమనగా మహా శివ రాత్రి రోజున స్వామి వారి కళ్యాణం జరగడం ముక్యమైన విషయం ,అదేరోజు రాత్రి 12 గంటల సమయంలో స్వామి వారు లింగ రూపంలో ప్రవేశించడం జరుగుతుంది .ఆ రోజున భక్తులందరూ స్వామి వారిని భక్తి శ్రద్దలతో దర్శించుకుంటారు .శివుడికి లెక్కలేనన్ని రూపాలు, ఆవిర్భావాలు ఉన్నాయి,వాటినన్నిటినీ మనము ఏడు విభాగాలుగా పొందుపర్చవచ్చు.దేవునిగా మనము భక్తితో కొలిచే ఈశ్వరుడు,ఉదారంగా మనకు తోడుండే శంభుడు, నిరాడంబరుడైన సన్యాసి ,అమాయకంగా మనపై ప్రేమను చూపే భోళా శంకరుడు, వేదాలను మనకు బోధించే జ్ఞానమూర్తి, దక్షిణామూర్తి, కళలకు ప్రతీక నటేశుడు,తీవ్రమైన,శిష్ట రక్షణ చేసే కాలభైరవుడు లేదా మహాకాలుడిగా, చంద్రుని మించిన సుందరమైన, శృంగార మూర్తి, సోమసుందరుడు, ఇవన్నీ ఏడు ప్రాధమిక రూపాలు మాత్రమే.
వీటినుండి లక్షల కొద్దీ ఆవిర్భవాలకు అవకాశం ఉందని మహర్షులు తెలియచేయడం జరిగింది.
ఇప్పుడు జరుగుతున్న కాలంలో ఒక సంగీత విద్వాంసుడైన శంకర శాస్త్రి కధ ఆధారంగా తెరకెక్కించిన శంకరా భరణం లాంటి క్లాసిక్ సినిమా గురుంచి ఈ రోజుకి మాట్లాడుకుంటునే ఉన్నాం ఈ సినిమాలోని శంకర్ శాస్త్రి గారు ఆ పరమ శివుడిని తన కఠోర భక్తి తో శంకరా శంకరా నాదశరీరా పరా వేదవిహారా హరా జీవేశ్వరా శంకరా.నాదశరీరా పరా.వేదవిహారా హరా జీవేశ్వరా శంకరా.అనే సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది .ఇక అలాగే మంజునాధ్ అయినా భక్తుడు శివుడిని తన జీవితంలో ఏవిధముగా ధూషించాడో మరల అదే విధంగా భక్తి తో ఆ శివుడికి పరమ భక్తుడు అయ్యాడు .ఆ విధంగా రూపొందించబడిన చిత్రమే శ్రీ మంజునాధ్ సినిమా.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy