మరోసారి పెళ్ళిచేసుకున్న శృంగార తార

బాలీవుడ్ బ్యూటీ సన్నిలియోన్ (Bollywood beauty Sunny Leone)గురించి ప్రత్యేకంగా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు.శృంగార తారగా తన కంటూ పేరును సొంతం చేసుకుంది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకోవడం, అలాగే హిందీలో స్పెషల్ సాంగ్స్ తో పాటు గెస్ట్ పాత్రలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది.ఇక మన తెలుగు ఇండస్ట్రీలో కూడా సన్నీలియోన్ (Sunny Leone)అడుగుపెట్టి తన కంటూ ఒక మంచి స్థానాన్ని సొంతం చేసుకుంది.

మన తెలుగులో ఈ బ్యూటీ రాజశేఖర్ హీరోగా నటించిన గరుడవేగ సినిమాలో స్పెషల్ సాంగులో కనువిందు చేసింది.అలాగే కరెంటు తీగ, మంచు విష్ణు నటించిన జిన్నా సినిమాలలో కూడా నటించింది.

అయితే, తాజాగా సన్నీలియోన్ మరోసారి పెళ్లి చేసుకుంది.పెళ్లి చేసుకున్నాక 13 ఏళ్ల అనంతరం బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్(Sunny Leone) ఆమె భర్త డేనియల్ వెబర్(Daniel Weber) మళ్లీ పెళ్లి చేసుకున్నారు.వీరు ఇద్దరు మాల్దీవులలో మరోసారి పెళ్లి చేసుకున్నారు.

Advertisement

అలాగే వీరిద్దరి కూడా పెళ్లి డ్రెస్సులలో అదరగొట్టారు.వీరి ఇద్దరి వివాహ వేడుకకు వారి పిల్లలు నిషా, అషెర్ సింగ్ వెబర్, నోహ్ సింగ్ వెబర్ సాక్షులుగా ఉన్నట్టు తెలుస్తుంది.

ఈ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు సన్నీలియోన్ పోస్ట్ చేస్తూ ‘తొలిసారి పెళ్లి దేవుడు, స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది.ఈసారి మేం ఐదుగురు మాత్రమే ఉన్నాం.మా మధ్య చాలా ప్రేమ, సమయం ఉంది.

నువ్వు ఎప్పుడూ నా జీవితంలో ప్రేమతో ఉంటావు’ ఇలా తెలిపింది.సన్నీలియోన్ జనవరి 2011 లో వెబర్‌ని వివాహం చేసుకోగా, వీరిద్దరూ కలిసి నిషను జులై 2017లో దత్తత తీసుకున్నారు.

అనంతరం 2018లో అషెర్ సింగ్ వెబర్, నోహ్ సింగ్ వెబర్ అనే కవలలు సరోగసి ప్రెగ్నెన్సీ ద్వారా పిల్లలు జన్మించారు.

ఇది కదా ట్రెండ్ అంటే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వంటమనిషి సీవీ
Advertisement

తాజా వార్తలు