ఫేస్బుక్ లో వైరల్ అవుతున్న కానిస్టేబుల్ రాసిన వింత లీవ్ లెటర్.! సెలవు ఎందుకు కావాలన్నాడంటే.?

లీవ్ లెటర్.స్కూల్ లో ఉన్నప్పుడు రాయడమే తప్ప తరవాత దానితో మనకి పెద్ద అవసరం పడలేదు అనుకుంట.

స్కూల్ కి వెళ్లలేకపోతే రకరకాల కారణాలు చెప్పి లీవ్ లెటర్ రాసే వాళ్ళం.ఎక్కువగా కడుపు నొప్పి, తలనొప్పి, జ్వరం అని రాసేవాళ్ళు.

ఇప్పుడు కార్పొరేట్ కంపెనీల్లో అంటే లీవ్ లెటర్ లతో పెద్దగా పరిచయం లేదు ఎందుకంటే అన్ని మెయిల్ లోనే జరిగిపోతాయి.కానీ కొన్ని ప్రభుత్వ సంస్థల్లో ఇప్పటికి సెలవు కావాలంటే పై అధికారులకు లీవ్ లెటర్ రాయాల్సిందే.

ఉత్తరప్రదేశ్‌లో ఓ కానిస్టేబుల్ సెలవు కోరుతూ రాసిన లేఖ మాత్రం వైరల్ గా మారింది.దానికి కారణం అతను లీవ్ లెటర్ లో సెలవు కోరుతూ రాసిన కారణం.

Advertisement

బులంద్‌షహర్‌ పీఎస్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ వినోద్ కుమార్ ఈ నెల 5న సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నాడు.అందులో.నాకు శివుడు కలలో కనిపించాడు.

నీటితో నిండిన కమండలం ఆకారంలో దర్శనిమిచ్చాడు.దాని చుట్టూ సర్పాలు తిరగడాన్ని కూడా గమనించాను.

దేవుడు తనకు జలాభిషేకం చేయడానికి హరిద్వార్ రమ్మన్నాడు.భగవంతుడి కోరిక నెరవేర్చేందుకు ఆరు రోజులు సెలవు కావాలని లేఖలో ప్రస్తావించాడు.

విచిత్రం ఏమిటంటే ఈ దరఖాస్తును పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు ఆరు రోజులు సెలవు కూడా ఇచ్చారు.

ఎన్టీఆర్ నాకన్నా చిన్నోడు... నన్ను మాత్రం ఒరేయ్ అని పిలుస్తాడు : రాజీవ్ కనకాల 
చనిపోయిన భార్యకు కర్మకాండ నిర్వహించిన భర్త.. కానీ, భర్త ముందు ప్రత్యక్షమైన భార్య.. అసలు ఏమైందంటే?

వినోద్ కుమార్ రాసిన ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.దేవుడు కలలో కనపడటం.జలాభిషేకం చేయమని అడగాడని చెప్పడం.

Advertisement

అధికారులు సెలవులు మంజూరు చేయడం హాట్‌టాపిక్ అయ్యింది.

తాజా వార్తలు