హిందూ ఆలయానికి భారీగా విలువ చేసే భూమిని విరాళం చేసిన ముస్లిం.. ఎక్కడో తెలుసా..?

తాజాగా మతసామరస్యానికి ప్రతీకగా ఓ సంఘటన నిలచింది.భారతదేశంలో మత సామరస్యానికి ప్రతీకగా ఈ సంఘటన నిలుస్తోంది.

కర్ణాటక రాష్ట్రంలో కోటి రూపాయల విలువ చేసే స్థలాన్ని ఓ ముస్లిం వ్యక్తి హిందూ దేవాలయానికి దానం చేశారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

బెంగళూరు రూరల్ జిల్లా హోస్కోట్ తాలూకా వలగేరేపురలోని ఆంజనేయుని ఆలయానికి అదే గ్రామానికి చెందిన భాష అనే వ్యక్తి భూమిని విరాళంగా ఇచ్చి అందరి మన్ననలను పొందుతున్నడు.ట్రాన్స్పోర్ట్ నిర్వహించే భాష ఆలయం సమీపంలో ఇది వరకు కొంత భూమిని కొనుగోలు చేశాడు.

వీరాంజనేయ ఆలయం మెయిన్ రోడ్డు పక్కనే ఉండడంతో.రోడ్డు విస్తరణలో భాగంగా ఆలయాన్ని పునర్నిర్మించాలని భావించారు.

Advertisement

అయితే అందుకు సరిపడేంత భూమి ఆలయానికి లేకపోవడంతో దేవాలయ సేవా సమితి భాషను సంప్రదించారు.ఇందులో భాగంగా ఆలయానికి కొంత స్థలం ఇవ్వాలని కోరారు.

ఐతే ఆ వ్యక్తి విరాళం కింద పూర్తి స్థలాన్ని ఇచ్చేస్తాడని తాము అనుకోలేదని ఆలయ ట్రస్ట్ చైర్మన్ ఎండి బైరేగౌడ తెలియజేశారు.ఆలయంలో ఎటువంటి కార్యక్రమాలు జరిగిన అందుకు ఆ వ్యక్తి ఎప్పుడూ పాల్గొనే వాడని అనే ధైర్యంతో ఆలయ కమిటీ సభ్యులు భాషను కొద్ది స్థలాన్ని అడగటానికి ప్రయత్నించామని తెలిపారు.

కాకపోతే భాష పూర్తి స్థలాన్ని ఇచ్చేయడంతో ఆలయ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.ఆలయ దర్శనం కోసం వచ్చిన భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసుకోవడానికి స్థలం అవసరం కావడంతో అందుకు భూమి అడగాలని కమిటీ సభ్యులు నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

భాష పెద్ద మనసు చేసుకొని ముందుకు రావడంతో ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలుపుతూ ఆలయం ముందర బాషా దంపతుల ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.మనం చాలా వరకు హిందువులు ముస్లింల మధ్య ఘర్షణ వాతావరణం సంబంధించి కథనాలు వింటున్న సమయంలో ఇలా హిందూ ఆలయానికి స్థలాన్ని అప్పగిస్తూ భాష తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయమే.

అదుర్స్ 2 ఆ కారణం చేతే చెయ్యలేదు...ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్! 
చనిపోయిన భార్యకు కర్మకాండ నిర్వహించిన భర్త.. కానీ, భర్త ముందు ప్రత్యక్షమైన భార్య.. అసలు ఏమైందంటే?

ఈ విషయంలో ఆలయ కమిటీ చైర్మన్ ఎండి బైరేగౌడ మాట్లాడుతూ ముస్లిం హిందువులు అన్నదమ్ముల అనే విషయాన్ని ఈ ఘటనను గుర్తు చేస్తున్నది చెప్పుకొచ్చారు.ఆలయం కట్టడానికి ఇప్పుడు పునాది వేశామని, అతి త్వరలో కోటి రూపాయలు ఖర్చు చేసి ఆలయ నిర్మాణం చేపడతామని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు