కారులో షికారు చేస్తూ నగరాన్ని తిలకిస్తున్న వానరం... ఎక్కడంటే?

వానారాలను మనం సహజంగా గ్రామాలలో లేదంటే ఊరికి దూరంగా వున్న అడవుల్లో చూస్తుంటాం.అవి అప్పుడప్పుడూ ఇళ్లల్లోకి కూడా వాస్తు ఉంటాయి.

మరికొన్ని చోట్ల గుళ్ళల్లో, చెట్లు ఎక్కువగా ప్రదేశాలు, కొండలున్న చోట ఎక్కువగా కన్పిస్తుంటాయి.అవి జనాలు పెట్టే ఆహరంతో పాటు సహజంగా లభించే చెట్లనుండి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాయి.

కొన్నిసార్లు ఇళ్లపై మూకుమ్మడిగా దాడిచేసి ఏది దొరికితే అది తీసుకుని పారిపోతుంటాయి.ఈ క్రమంలో కొన్నిసార్లు కోతులు( Monkeys ) తమ తల్లి నుంచి అనుకోకుండా తప్పిపోతుంటాయి.

మరికొన్నిసార్లు తల్లి కోతులు చనిపోయిన కూడా పిల్ల కోతులు అనాథలుగా మారిపోతుంటాయి.అచ్చం ఇక్కడ అలాగే జరిగింది.

Advertisement

ఒక పిల్ల కోతి తన తల్లిచనిపోవడంతో వేరుపడిపోయింది.

ఈ ఘటన లక్నోలో( Lucknow ) చోటు చేసుకోగా స్థానంగా వున్న ఆలయంలోకి వచ్చి చేరింది ఆ కోతి పిల్ల.దాంతో ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ వివేక్ తంగ్డి( Vivek Thangdi ) చిన్నారి వానరాన్ని చేరదీశారు.అంతేకాకుండా ఆ కోతి పిల్లను తన సొంత బిడ్డలా సాకుతున్నారు.

ఈ క్రమంలో ఆలయ సభ్యులందరిలో అది కలిసిపోయింది.అక్కడికి వెళ్లిన భక్తులు కూడా దీన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు.

భక్తులు వానరం వద్దకు వచ్చి ఆశీస్సులు తీసుకుంటారు.వారిదగ్గరున్న అరటిపండ్లను దానిని వేస్తూ వుంటారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

అంతేకాదండోయ్.ఆలయ పూజారి కారులో కూర్చొని నగరాన్ని కూడా అది చుట్టేస్తుంటుంది.

Advertisement

ప్రతిరోజు కోతిపిల్లకు స్నానం చేయించి ఆలయానికి తీసుకొస్తుంటారు.దీనికి ప్రేమతో బజరంగి అని పేరు పెట్టారు.

ఆ బుల్లి బజరంగీకి టీ షర్టులు( T-shirts for Bajrangi ) కూడా తొడుగుతున్నారు.డ్రై ఫ్రూట్స్, గుడిలో వచ్చే ప్రసాదం వానరంకు తినిపిస్తుంటారు పూజారులు.ఈ విషయం మీద భక్తురాలు సలోని శుక్లా మాట్లాడుతూ.

ఇంతకుముందు హనుమంతుని దర్శనం కోసమే తాను హనుమాన్ ఆలయానికి వచ్చేవాడినని, కానీ ఇప్పుడు తాను ప్రతిరోజూ ప్రత్యక్షంగా బజరంగిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నానని చెప్పారు.మరోవైపు, బజరంగీని చూడటం కూడా తనకు ఇష్టమని ఆరాధ్య శుక్లా అనే భక్తురాలు చెప్పుకొచ్చింది.

తాజా వార్తలు