ఐదు రోజులుగా లోతైన బావిలో కోతి

యాదాద్రి భువనగిరి జిల్లా:నరులకే కాదు వానరులకు కూడా ఇబ్బందులు వస్తుంటాయనే సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలో వెలుగులోకి వచ్చింది.

రాజుల కాలంలో చేదుడు బావిగా పిలవబడే నల్లాల బావి వర్షాలు లేక ఎండిపోవడంతో ప్రమాదవశాత్తు ఓ కోతి అందులో పడిపోయింది.

అది చూసి మిగతా కోతులు మొత్తుకోవడంతో చుట్టుపక్కల ప్రజలు గమనించి,గత మూడు రోజులుగా పండ్లు,ఆహారం అందిస్తున్నారు.అడవుల్లో జీవనాధారం కోల్పోయిన వానరాలు గ్రామాల బాట పట్టిన విషయం విధితమే.

ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి బావిలో పడ్డ కోతిని బయటికి తీసి రక్షించాలని కోరుతున్నారు.

డ్రగ్స్ నిర్ములనకు అవగాహనా కార్యక్రమం డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదాం – ఎస్సై డి సుధాకర్
Advertisement

Latest Video Uploads News