చేనేత ఉత్పత్తులపై కేంద్రం విధిస్తున్న 5శాతం జీఎస్టీని రద్దు చేయాలని కోరుతూ చేనేత కార్మికులు నేడు పెద్ద ఎత్తున ప్రధాని మోదీకి పోస్టుకార్డులను పంపించనున్నారు.నిజాం కాలేజీ నుండి ర్యాలీగా బయలుదేరి అబిడ్స్ జీపీఓ వరకు వెళ్లనున్నారు.
పోస్టు కార్డులను ఇచ్చిన తర్వాత సమావేశం కానున్నారు.కాగా పోస్టు కార్డు ఉద్యమాన్ని చేపట్టాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.