నిన్న మొన్న శని ఆదివారం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమా ఒకటే ఒకటి అంటూ బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.అదే కన్నడ చిత్రం కాంతార కన్నడం లో ఒక చిన్న చిత్రంగా తెరకెక్కి భారీ విజయాన్ని సొంతం చేసుకుని రూ.100 కోట్ల కు పైగా కలెక్షన్స్ నమోదు చేసిన కాంతార సినిమా కేవలం కన్నడం లో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో కూడా భారీ కలెక్షన్స్ నమోదు చేస్తూ దూసుకు పోతుంది.నిన్న మొన్న శని ఆదివారాల్లో తెలుగు లో పెద్ద సినిమా లు ఏమీ లేక పోవడం.
అంతకు ముందు శుక్రవారం విడుదలైన సినిమాల్లో ఏ ఒక్కటి కూడా సక్సెస్ అవ్వక పోవడం తో ఈ సినిమానే జనాలు తెగ చూసేసారు.

తెలుగు రాష్ట్రాల్లో కాంతార సినిమా ఆదరణ ఏ మాత్రం తగ్గలేదని నిన్న మొన్న వచ్చిన కలెక్షన్స్ ని చూస్తుంటే అర్థమవుతుంది.కేవలం తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ వద్దనే కాకుండా ఉత్తరాది బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఈ చిత్రం చేసిన సందడి అంతా అంతా కాదు.హిందీ లో డబ్బింగ్ అయ్యి రెండు వారాలు అవుతున్న కూడా అక్కడ జోరు కంటిన్యూ అవుతుంది.
భారీ ఎత్తున కలెక్షన్స్ నమోదు అవుతున్నట్లుగా హిందీ బాక్సాఫీస్ వర్గాల వారు అధికారికంగా ప్రకటించారు.మొత్తానికి శని ఆది వారాల్లో దేశ వ్యాప్తంగా కేవలం కాంతార సినిమా మాత్రమే ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ని అందించింది.
ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కిస్తే దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు అనే విషయాన్ని హీరో రిషబ్ శెట్టి నిరూపించాడు.ఈయన ముందు ముందు మరిన్ని అద్భుతమైన సినిమా లను తెరకెక్కించాలని అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు.







