షాకింగ్ వీడియో.. ఎత్తైన జలపాతం నుండి జారిపడిన వ్యక్తి

యువత అంటే ఉత్సాహం, శక్తి ఇంకా సాహసం.ఈ టెక్నాలజీ కాలంలో యువత చేయలేనిది అంటూ ఏమీ లేదు.

అన్ని రంగాల్లోనూ పోటీపడి దూసుకెళ్తున్నారు.ఏదైనా సాహసం చేయాలంటే అంత ఈజీ కాదు.

దానికి ఎంతో శిక్షణ కావాలి.సరైన శిక్షణ లేకుండా సాహసాలు చేసి ప్రాణాలు పోగొట్టుకున్న వారి గురించి నిత్యం మనం సోషల్‌ మీడియాలో వింటూనే ఉన్నాం.

సాధారణంగా జలపాతల వద్దకు వెళ్తే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాల మీదకే వస్తుంటుంది.

Advertisement

నీటితో ఎలాంటి సాహసాలు చేయకూడదు.అలా సాహసం చేసిన ఓ వ్యక్తికీ సంబందించిన ప్రమాదకరమైన ఓ వీడియో బయటకు వచ్చింది.

ఈ వీడియోలో ఓ వ్యక్తి జలపాతంపై నుంచి కింది పడిపోయాడు.ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

ఓ వ్యక్తి కొండపై నుంచి జలపాతం వైపుగా వెళ్తుండగా, ప్రమాదవశాత్తు జారి కిందకు పడ్డాడు.ఇది చూసిన అక్కడున్న వారు భయంతో వణికిపోయారు.

ఈ భయానక దృశ్యాన్ని చూస్తే తప్పకుండా అతని చనిపోయి ఉంటాడని భావించారు.కానీ అతనికి పెద్దగా గాయాలేమి కాకుండా బతికి బయట పడ్డాడు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

ఈ స్టంట్ చాలా ప్రమాదకరమైనది.ప్రస్తుతం ఆ వ్యక్తికి ప్రాణాలు పోయేంత గాయాలు కానట్లు తెలుస్తోంది.

Advertisement

వైరల్ అవుతున్న వీడియో చైనాలోని సుసోంగ్ కౌంటీలోని జియుజింగ్‌గౌలోని ఒక పర్యాటక ప్రదేశంలో జరిగింది.ప్రస్తుతం వీడియో చివరలో పడిపోయిన తర్వాత, వ్యక్తి రాళ్ల కొలనులోకి వెళ్లగలిగాడు.

అతని చుట్టూ నిలబడి ఉన్న వ్యక్తులు అతన్ని రక్షించారు.ఈ వీడియోను సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

వీడియో చూసిన యూజర్లు ఇలాంటి చోట్ల జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

తాజా వార్తలు