ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.
ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ల మేరకు బేసిక్ శాలరీని 17 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది సర్కార్.దీంతో పాటు ఫించన్ విధానంపై కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.
ప్రభుత్వ ప్రకటనతో ఉద్యోగులు తమ సమ్మెను విరమించారు.అయితే కర్ణాటకలో దాదాపు 25 ఏళ్ల తరువాత ఉద్యోగులు సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7 లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్న సంగతి తెలిసిందే.