బ్రెజిల్ దేశ అధ్య‌క్షుడికి భారీ జ‌రిమానా.. ఎందుకంటే.. ?

చాలా సందర్భాల్లో చట్టం ఎవరి చుట్టం కాదని అంటారు.కానీ అవినీతి రాజకీయాలు చేసే వారికి చట్టం చుట్టమే అని ఎన్నో సార్లు నిరూపించబడింది.

 A Huge Fine For The President Of Brazil, Brazil, President Bolsonaro, Governor F-TeluguStop.com

చట్టంలోని లొసుగులను చేతిలో పట్టుకుని తప్పుడు పనులు చేసి తప్పించుకున్న వారు ఎందరో ఉన్నారు మనదేశంలో.

కానీ విదేశాల్లో మాత్రం దాదాపుగా తప్పు చేసిన వారు ఆ దేశానికి అధ్యక్షుడైనా సరే ఏదో ఒకరకంగా శిక్షించడం సర్వసాధరణమే.

ఇదే విషయాన్ని రుజువు చేసింది బ్రెజిల్ దేశం.వచ్చే సంవత్సరం ఈ దేశంలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఇప్పటి నుండే దేశ అధ్య‌క్షుడు బోల్సోనారో ఎన్నిక‌ల ప్ర‌చారం మొదలు పెట్టారు.

అసలే కరోనా కాటుకు బ్రెజిల్ విల విలలాడుతుండగా బోల్సోనారో మాత్రం మాస్క్ పెట్టుకోకుండా ఓపెన్ హెల్మెట్‌తో బైక్ ర్యాలి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారట.కాగా ఈ ఘటన కాస్త గవర్నర్ జ‌వావో డోరియా దృష్టికి వెళ్లడంతో ఆయన ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ, చట్టానికి ఎవరు చుట్టం కాదంటూ క‌రోనా నిబంధ‌న‌లు పాటించకుండా ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వహించిన దేశ అధ్య‌క్షుడు బోల్సోనారో కు వంద డాల‌ర్ల జ‌రిమానా విధించారట.

ఇదే కదా సమ న్యాయం అంటే.ఇక మన దేశంలో ఉన్నాయి చట్టాలు చెప్పుకోవడానికే గానీ చేతలకు మాత్రం ఎప్పుడు కిలోమీటర్ దూరంలో ఉంటాయి అని అనుకుంటున్నారట విషయం తెలిసిన జనం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube