భూగర్భ లోతుల్లో కట్టిన హోటల్.. అక్కడికి వెళ్లడమే ఓ పెద్ద సాహసం..

సాధారణంగా భూగర్భంలోకి ఒక 100 అడుగుల లోతుకు వెళితేనే చాలా భయమేస్తుంది.అలాగే ఆక్సిజన్ కూడా అందదు.

 A Hotel Built Underground  Going There Is A Big Adventure, Deep Sleep, Go Below-TeluguStop.com

అలాంటిది యునైటెడ్ కింగ్‌డమ్‌లో( United Kingdom ) ఒక హోటల్‌ను భూమికి 1,375 అడుగుల దిగువన నిర్మించారు.ఇందులోకి వెళ్లాలంటే ప్రాణాలపై ఆశ వదిలేసుకోవాలని చెబుతుంటారు.

ఎందుకంటే ఈ హోటల్లోకి వెళ్లాలంటే చాలా అడ్వెంచర్స్ చేయాల్సి ఉంటుంది.డీప్ స్లీప్ అని ఈ ప్రత్యేకమైన హోటల్‌ను పిలుస్తుంటారు.

ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన అండర్‌గ్రౌండ్ హోటల్.స్నోడోనియా పర్వతాల( Mountains of Snowdonia ) క్రింద 1,375 అడుగుల దిగువన ఇది ఉంటుంది.

అక్కడికి చేరుకోవడానికి, పాత విక్టోరియన్ స్లేట్ గని( Victorian slate mine ) గుండా ప్రయాణించాలి.డీప్ స్లీప్ అనేది సాధారణ హోటల్ లాంటిది కాదు, ఇది మరింత సాహసోపేతమైన క్యాంపింగ్ అనుభూతిని అందిస్తుంది.

డీప్ స్లీప్‌లో జంట పడకలతో నాలుగు ప్రైవేట్ క్యాబిన్‌లు, రొమాంటిక్ బస కోసం డబుల్ బెడ్‌తో కూడిన ప్రత్యేక గ్రోట్టో క్యాబిన్ ఉన్నాయి.క్యాబిన్లు వెచ్చగా, ఫుల్లీ వెంటిలేటెడ్ ఫెసిలిటీతో ఉంటాయి.

అలానే అవి మందపాటి ఇన్సులేషన్ కలిగి ఉంటాయి.అయినప్పటికీ, గని చాలా చల్లగా ఉంటుంది, ఏడాది పొడవునా 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఇక్కడ నమోదు అవుతుంటుంది.

కాబట్టి, సందర్శకులు వెచ్చని బట్టలు ధరించాల్సి వస్తుంది.

Telugu Adventure, Deep Sleep, Hotel, Worldsdeepest-Latest News - Telugu

ఈ హోటల్‌లో వివిధ రకాల ఆహారాన్ని వడ్డిస్తారు.మాంసాహారులు, శాఖాహారులు కోసం ప్రత్యేక వంటకాలు కూడా ఉంటాయి.కావాలనుకుంటే సొంత ఆహారం, పానీయాలను కూడా తీసుకురావచ్చు.14 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు పెద్దవారితో పాటు డీప్ స్లీప్ హోటల్‌కు వెళ్లవచ్చు.వరల్డ్స్ డీపెస్ట్ హోటల్‌లో బస చేయడానికి, ముందుగానే బుక్ చేసుకోవాలి.

డీప్ స్లీప్ శనివారం రాత్రి నుండి ఆదివారం ఉదయం వరకు వారానికి ఒకసారి మాత్రమే తెరిచి ఉంటుంది.హోటల్‌కి ప్రయాణం అంత సులభం కాదు.ఇది Blaenau Ffestiniog సమీపంలోని Tanygrisiau బేస్ అనే ప్రదేశంలో ప్రారంభమవుతుంది.పర్వతాల పైకి 45 నిమిషాలు నిటారుగా నడవాల్సి ఉంటుంది.

అయితే పై నుండి దృశ్యం అందంగా ఉంటుంది.

Telugu Adventure, Deep Sleep, Hotel, Worldsdeepest-Latest News - Telugu

మీరు పర్వత శిఖరానికి చేరుకున్న తర్వాత, మీకు హెల్మెట్, లైట్, జీను, వెల్లింగ్టన్ బూట్లతో కూడిన కిట్ ఇస్తారు.పైనుంచి హోటల్‌కి నిటారుగా, సవాలుగా ఉండే మార్గంలో ముందుకు సాగాలంటే ఇవి తప్పకుండా ధరించాలి.ఇక ఖర్చు గురించి మాట్లాడుకుంటే… డీప్ స్లీప్‌లో ప్రైవేట్ క్యాబిన్ ధర £350 (దాదాపు రూ.36 వేలు), ప్రత్యేక గ్రోట్టో క్యాబిన్‌లో( grotto cabin ) ఉండే ఇద్దరు వ్యక్తులకు ధర £550 (రూ.56 వేలు) ఉంటుంది.ఈ ఖర్చులోనే శనివారం సాయంత్రం, ఆదివారం ఉదయం హోటల్ ఫ్రీగా భోజనం, అలాగే హాట్ డ్రింక్స్ ఆఫర్ చేస్తుంది.హోటల్ మీకు అవసరమైన అన్ని పరుపులను కూడా అందిస్తుంది.

వరల్డ్స్ డీపెస్ట్ హోటల్‌లో మీ బసను బుక్ చేసుకోవడానికి, go Below అధికారిక వెబ్‌సైట్‌ go-below.co.ukని విజిట్ చేయాలి.వెబ్‌సైట్‌లో డీప్ స్లీప్‌ని విజిట్ చేయాలనుకున్న తేదీని ఎంచుకుని, బుకింగ్ ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube