ప్రతిరోజు కొన్ని మొలకెత్తిన సెనగలు.. ఆహారంలో భాగం చేసుకుంటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..

సాధారణంగా చెప్పాలంటే పప్పు ధాన్యాలు( Pulses ) ప్రతి రోజు ఆహారంలో భాగం చేసుకుంటే మన శరీరానికి ఎంతో శక్తినిచ్చే ప్రోటీన్స్ లభిస్తాయి.

కాబట్టి మనం తరుచుగా ఏదో ఒక పప్పు ధాన్యాలను మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల పోషకాహార లోపాన్ని దూరం చేసుకోవచ్చు.

ముఖ్యంగా చెప్పాలంటే శాఖాహారులకు అతి ముఖ్యమైన ఆహారం పప్పు ధాన్యాలు.ఎందుకంటే ఇందులో అత్యధిక ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, క్యాల్షియం, మెగ్నీషియం , పొటాషియం లాంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

ముఖ్యంగా చెప్పాలంటే సెనగ గింజలను( Senagalu ) ప్రతి రోజు మొలకెత్తేలా చేసి లేదా ఉడకబెట్టి తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.సెనగ గింజలను మొలకెత్తిన చేసి తినడం వల్ల మనలో రోగ నిరోధక శక్తి( Immunity ) పెరుగుతుంది.

ఇంకా చెప్పాలంటే మొలకెత్తిన గింజలలో క్యాల్షియం, పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల కీళ్ల నొప్పుల సమస్య ( Joint pain problem )దూరం అవడంతో పాటు రక్త ప్రసరణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.

Advertisement

ఇంకా చెప్పాలంటే నడుము చుట్టూ పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంతో పాటు ఊబకాయం, హై బీపీ సమస్యలను కూడా దూరం చేస్తుంది.మొలకెత్తిన సేనగలలో కోలిన్ అనే పదార్థం నాడీ కణాల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది.దీని వల్ల మెదడు చురుగ్గా ఉండడంతో పాటు మానసిక ఒత్తిడి, నిద్రలేమి సమస్యలను దూరం చేస్తుంది.

అంతే కాకుండా పచ్చకామెర్ల వ్యాధితో బాధపడేవారు సెనగలను బెల్లంతో కలిపి నాన బెట్టుకొని ప్రతి రోజు తింటే వ్యాధి తీవ్రత తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.ఉదయాన్నే మొలకెత్తిన సెనగ గింజలను ఆహారంగా తీసుకుంటే వీటిలో అత్యధికంగా ఉన్న లైకోపిన్,షాపోనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్, బ్యూటీన్ ప్యాంటీ ఆమ్లాలు మన శరీరంలోని క్యాన్సర్ కులాలను తొలగించి క్యాన్సర్ బారిన పడకుండా మనల్ని రక్షిస్తాయి.

Advertisement

తాజా వార్తలు