ఇన్‌స్టాగ్రామ్ సీఈవో పై ఫిర్యాదు.. ఎందుకంటే..?!

హిందువుల ఎంతగానో ఆరాధించే దేవుళ్లలో శివుడు కూడా ఒకరు.మన దేశంలో శివ భక్తులు చాలామందినే ఉన్నారు.

ఎంతో మంది భక్తులు నిరంతరం శివుణ్ణి ప్రతిరోజు ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తూ ఉంటారు.అయితే ఇప్పుడు శివయ్యకి సంబంధించిన కొన్ని ఫోటోలు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఢిల్లీకి చెందిన బీజేపీ నేత తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు.

శివును ఫోటోలు కొన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ లో దర్శనం ఇచ్చాయి.అలాగే జిఫ్ ఫార్మాట్‌ లో శివుడిని అనుచిత రీతిలో ఆ యాప్ రూపొందించినట్లు మనీష్ సింగ్ తెలిపారు.

ఆ ఫోటోలలో శివుడు ఒక చేతిలో మద్యం గ్లాసు పట్టుకుని ఉంటాడు.అలాగే మరో చేతిలో మొబైల్ ఫోన్‌ పట్టుకుని కన్ను కొడుతు చిత్రీకరించారు.

Advertisement

ఇలాంటివి శివుడికి సంబంధించిన జిఫ్‌ ఇమేజ్‌ స్టికర్‌ ను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ సెక్షన్‌ లో పోస్టు చేశారు.అక్కడ సెర్చ్ బాక్స్ లో శివ అని టైప్ చేసిన వెంటనే ఈ స్టిక్కర్స్ కనిపిస్తాయి.

అయితే., ఈ ఫోటోలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ నేత పార్లమెంట్ వీధిలో ఉన్న పోలీస్ స్టేషన్‌ లో ఇన్‌స్టాగ్రామ్ సీఈవో, ఇతర అధికారులపై ఫిర్యాదు నమోదు చేశారు.

గ్రాఫిక్స్ ఫార్మాట్‌ లో శివుడిని అభ్యంతరకర రీతిలో చిత్రీకరించారని మనీష్ సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అంతేకాకుండా హిందువుల మనోభావాలను దెబ్బతీసి, వాళ్ళను రెచ్చగొడితే విద్వేషాలు వస్తాయన్నా ఉద్దేశంతో ఈ ఫోటోలు క్రియేట్ చేసారని మండిపడ్డారు.శివుడిని ఇంతలా అవమానకర రీతిలో చిత్రీకరించిన ఇన్‌స్టాగ్రామ్ సీఈవో పై క్రిమినల్ కేసు పెట్టాలని ఆయన కోరారు.ప్రస్తుతం శివుడికి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.

నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..
వైరల్ వీడియో : ఏంటి భయ్య.. కోడిని పట్టుకున్నట్లు చిరుతను అలా పట్టేసావ్..

మరి ఈ వివాదంపై ఇన్‌స్టాగ్రామ్ సీఈవో ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు