కరోనా దిగ్బంధంలో కార్పొరేట్‌ స్కూల్‌.. ఏకంగా ఎంత మందికంటే.. ?

దేశంలో క్రమ క్రమంగా కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ విషయంలో పలు రాష్ట్రాలు కఠిన నిబంధలను విధించాయి.

 A Corporate School In Andhra Pradesh In Corona Blockade , Krishna District, Agir-TeluguStop.com

కోవిడ్ నియంత్రణ నియమాలను పాటించాలని ఆదేశించాయి.ఈ నేపధ్యం లో పాఠశాలలకు కూడా హాలీడేస్ ప్రకటించారు.

అయితే ఎక్కడైతే స్కూళ్లు, కాలేజీలు కొనసాగుతున్నాయో అక్కడ ఈ కరోనా వ్యాపిస్తున్నట్లు తెలుస్తుంది.

ఈ దశలో పలు చోట్ల కరోనా కేసులు బయట పడుతున్నాయి.

ఇకపోతే ఏపీలోని పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులు కరోనా బారిన పడుతున్నట్లుగా ఎక్కువగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలో తాజాగా కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలంలోని ఓ కార్పొరేట్‌ స్కూల్‌ లో ఏకంగా 55 మంది విద్యార్థులకు, ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందట.

దీంతో ఇక్కడ కాస్త ఆందోళన నెలకొంది.కాగా కరోనా దెబ్బకు స్కూలును మూసివేసి, ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాలని యాజమాన్యాన్ని అధికారులు ఆదేశించినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube