తెలుగు రాష్ట్రాల్లో ఈటీవీ గురించి తెలియని వారు ఉండరు అంటే అతి శయోక్తి కాదు.ప్రతి తెలుగు ఇంట్లో కూడా ఈటీవీ మోగుతూనే ఉంది.
గత 20 సంవత్సరాలుగా ఈటీవీ తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంది.ఈటీవీ తాజాగా నాలుగు కొత్త ఛానెల్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ప్లస్, సినిమా, అభిరుచి, లైఫ్.ఈ నాలుగు ఛానెల్స్‌కు ప్రేక్షకుల నుండి ఆధరణ లభిస్తోంది.
ఈ నేపథ్యంలో మరిన్ని ఛానెల్స్‌ను తీసుకు రావాలని ఈటీవీ అధినేత రామోజీ రావు నిర్ణయించుకున్నాడు.
మొదట్లో రామోజీరావు కేవలం ఈనాడు పేపర్‌పైనే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టే వారు.
కాని ప్రింట్ మీడియాకు ఆధరణ తగ్గుతోంది.అంతా కూడా డిజిటల్ అయిన నేపథ్యంలో ఇక టీవీలపై పడ్డాడు.
ఈయన ఆలోచన నుండి వచ్చిన నాలుగు కొత్త ఛానెల్స్ మంచి ఆధరణ దక్కించుకోవడంతో మరి కొన్నింటికి అంకురార్పణ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఆధ్యాత్మికం, వ్యవసాయం, బిజినెస్, ఆటలు, విద్యతో పాటు ఇంకా పలు రంగాల్లో ప్రత్యేక ఛానెల్స్‌ను తీసుకు వచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే కేంద్రం నుండి అనుమతి కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది.ఈ సంవత్సరంలోనే కొత్త ఛానెల్స్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యే అవకాశాలున్నాయి.