లాజిక్ మిస్ అయిన మంత్రి నారాయణ

నారాయాణ విద్యా సంస్థల అధిపతి, తెలుగు దేశం పార్టీ కీలక నేత , ఎమ్మెల్సీ, మంత్రి కూడా అయిన నారాయణ లో కొత్త కోణాలు చూస్తున్నారు జనాలు.

ఎప్పుడూ లేనంతగా ఆయన వీర ఆవేశం తో ఊగిపోతున్నారు.

ఇప్పటి వరకూ ఆయన సైలెంట్ గా ఉండడం ఏదైనా ఇబ్బంది ఒస్తే సైలెంట్ గా డీల్ చెయ్యడం లాంటివి చూసాం కానీ ఈ రకంగా కోపంతో ఆయన ఊగిపోవడం ఇదే మొట్ట మొదటి సారి అని చెప్పాలి.అమరావతి లో టీడీపీ అవినీతి భాగోతాలు చేస్తోంది అనీ దానికి నారాయణ వెనకాల ఉండి కథ నడిపిస్తున్నారు అంటూ సాక్షీ మీడియా వారు చేస్తున్న గోల కి ఆయన సమాధానంగా ఇలా కోప్పడుతున్నారు అన్నమాట.

దాదాపు మూడు వేల ఎకరాలు నారాయణ కాజేశారు అనేది ప్రధాన ఆరోపణ అంటే దాని విలువ కనీసం 14 వేల ఎకరాలు ఉంటుంది గాక.పైగా, నారాయణ విద్యా సంస్థల్లో పనిచేసే చిరుద్యోగుల పేరుతో ఎకరాలకు ఎకరాల భూముల్ని కొల్లగొట్టారంటూ సవివరంగా సాక్షి కథనాల్ని తెరపైకి తెచ్చింది.నారాయణ తన బంధువులతోనూ భూముల్ని కొనుగోలు చేయించారంటూ వాటి వివరాల్నీ సాక్షి పేర్కొంది.

నారాయణ భూ దందాకి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలన్నది సాక్షి ప్లస్‌ వైఎస్సార్సీపీ ఆరోపణ.అయితే దీని మీద ఆయన కోప్పడుతున్నారు.మా సంస్థలో 40 వేల మందికి పైగా ఉద్యోగులున్నారు.

Advertisement

లక్షలాది మంది విద్యార్థులున్నారు.వారెవరో భూములు కొనుగోలు చేస్తే అవన్నీ నా ఖాతాలో వేసెయ్యడం ఎంతవరకు సబు.? అన్నది నారాయణ ప్రశ్న.మహా అయితే నారాయణ లో పనిచేసే ఉద్యోగికి ఎక్కువలో ఎక్కువ లక్ష రూపాయల జీతం వేసుకున్నా అలాంటి వ్యక్తులు యాభై నుంచి వంద కోట్ల భూములు ఎలా ఉంటారు అనేది ఇక్కడ భారీ లాజిక్.

ఇదే ప్రశ్న ఆయన్ని అడిగితే అది ఇంకం టాక్స్ వారు చూసుకోవాలి అంటున్నారు ఆయన.

Advertisement

తాజా వార్తలు