యాభై కోట్ల నాగార్జున, మతిపోగోట్టేసాడు

ఎవ్వరూ ఊహించనిది జరిగింది.ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ -మహేష్ – చరణ్ , బన్నీ లు మాత్రమే ఉన్న యాభై కోట్ల క్లబ్ లో పోయిన సంవత్సరం ప్రభాస్ కూడా జాయిన్ అయ్యాడు.

 Nagarjuna Tops All Senior Heroes-TeluguStop.com

ఈ ఏడాది జూనియర్ ఎన్టీఆర్ కూడా నాన్నకు ప్రేమతో తో ఒచ్చేసాడు.అయితే వీరంతా జూనియర్ హీరోలు సీనియర్ తరమైన బాలయ్య, నాగార్జున , వెంకటేష్ లకి ముప్పై కోట్ల క్లబ్ లు కూడా లేవు కానీ నాగార్జున అనలిస్ట్ ల కళ్ళు బైర్లు గమ్మే లాగా సోగ్గాడే చిన్ని నాయన తో యాభై కోట్ల క్లబ్ లో కొచ్చేసాడు.

రిలీజ్ అయిన నాలుగు వారాల్లో 50 కోట్ల ”షేర్” కలెక్షన్స్ ను సాధించాడు సోగ్గాడు.

ఇంతమంది సాధించాక.

నాగ్ ఆ రికార్డు కొట్టడం పెద్ద విశేషమా అనుకోవచ్చు.కానీ ఇప్పటివరకూ హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ లే.నాగార్జున మాత్రం కేవలం 15కోట్లతోనే సోగ్గాడే చిన్ని నాయన చిత్రాన్ని తీశాడు.నాన్నకు ప్రేమతో చిత్రాన్ని థియేటర్లలోకి తెచ్చేందుకు 54కోట్లు ఖర్చైంది.

దానికి వచ్చిన మొత్తం కూడా అంతే.కానీ నాగ్ మాత్రం 15 కోట్లతో సినిమా తీసి ఫుల్లు కాంపిటీషన్ లోనే ధైర్యంగా రిలీజ్ చేసి.

యాభై మార్క్ ను అందుకున్నాడు.అందుకే ఈ సంక్రాంతికి కింగ్ నాగార్జునే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube