ఒకప్పుడు హీరోయిన్ లు అందం మీదా , అభినయం మీదా దృష్టి పెట్టే వారు.కానీ ఇప్పుడు పరిస్థితి మారింది ఈ తరం హీరోయిన్ లు ఎక్కువగా షేప్ ల మీదా బాడీ మీదా కాన్సంట్రేట్ చేస్తున్నారు.
డాన్సులూ, ఫైట్ లూ, బికినీ అందాలు ఒకటేవిటి హీరోతో సమానంగా కనిపిస్తున్న హీరోయిన్ లకి జిమ్ బాడీ అత్యంత అవసరం అయ్యింది.ఈ కాలం హీరోయిన్ లలో జిమ్ కి ఎక్కువగా వెళ్ళేవాళ్ళ లిస్టు లో సమంత , శృతి హాసన్ ఉండగా ఇప్పుడు రకుల్ వారి పంచన చేరింది.
దీనికోసం ప్రత్యెక కోచ్ ని కూడా ఏర్పాటు చేసుకుంది ఆమె.అంతే కాకుండా రకుల్ ప్రీత్ సింగ్ ఎఫ్45 అనే ఓ కార్డియో ట్రైనింగ్ సెంటర్ ని ఓపెన్ చేస్తోంది.ఈ సెంటర్ కోసం ప్రత్యేకంగా రకుల్ పై షూట్ చేసిన ఓ వన్ మినిట్ యాడ్ ని యూట్యూబ్ లో పోస్ట్ చేశారు.ఇంతగా ఒక జిమ్ సెంటర్ యాడ్ రకుల్ లాంటి టాప్ లీగ్ హీరోయిన్ ఎందుకు చేసిందా అంటే.
అసలు విషయం అప్పుడు తెలిసింది.ఆ కార్డియో సెంటర్ రకుల్ ప్రీత్ సింగ్ దే నట.ఈ నెల 20న హైద్రాబాద్ గచ్చిబౌలీలో దీన్ని లాంఛ్ చేయనున్నారు.మరి రకుల్ ఇచ్చే ట్రైనింగ్ ఎవరెవరు తీసుకుంటారో?
To Watch Rakul Preet Gym Video







