ఇలియానా అన్నారు … మళ్ళీ రీఎంట్రీ ఇస్తోంది అన్నారు.శృతిహాసన్ అన్నారు .
బాలివుడ్ హీరోయిన్ అన్నారు … అటుచేసి ఇటుచేసి మళ్ళీ పాత హీరోయిన్ వైపే మొగ్గుచూపాడు రామ్ చరణ్.తన గత చిత్రం బ్రూస్ లీ లో తనతో చిందులేసిన రకుల్ ప్రీతే మళ్లీ కావాలంట చరణ్ కి.విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సురెందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ చేయబోతున్న తని ఒరువన్ రిమేక్ లో రకుల్ ప్రీత్ కథానాయికగా ఫిక్స్ అయిపోయింది.
సురెందర్ రెడ్డి ఇలియానే కావాలని మంకుపట్టు పట్టినా, చివరికి రామ్ చరణ్ తన పంతం నెగ్గించుకున్నాడు.
ఈ నెల 20వ తేదిన ఈ చిత్రాన్ని ప్రారంభిస్తారని సమాచారం.రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుపెట్టి ఆగస్టులో సినిమాని విడుదల చేసే ప్లాన్ లో యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.
గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించనున్న ఈ చిత్రానికి హిప్ హాప్ తమిజా సంగీత దర్శకత్వం వహిస్తాడు.తమిళ వెర్షన్ లో విలన్ గా మెప్పించిన అరవింద సామి తెలుగులో కూడా విలన్ గా నటించనుండటం విశేషం.







