సూపర్ స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమా ఏప్రిల్‌లో రాబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు కొన్ని నెలల ముందే ప్రకటించిన విషయం తెల్సిందే.అయితే అదే నెలలో పలు చిన్న పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
ఇక ఈ సినిమాకు పోటీని ఇచ్చేందుకు త్రివిక్రమ్ తన ‘అ ఆ’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది.ఏప్రిల్ 22న ఈ సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేశారు.
దాంతో మహేష్, త్రివిక్రమ్ ఢీ కొట్టబోతున్నారు అంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి.కాని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం మహేష్ మరియు త్రివిక్రమ్‌ల మధ్య ఒప్పందం జరిగిందని, అందుకే ఏప్రిల్ 22న ‘అ ఆ’ చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
మాటల మాంత్రికుడు ఇటీవలే మహేష్‌బాబుతో ‘బ్రహ్మోత్సవం’ సినిమా విడుదల తేదీపై చర్చలు జరిపాడట.షూటింగ్ ఇంకా పూర్తి కానందున ఈ సినిమాను కాస్త ఆలస్యం అంటే మేలో విడుదల చేస్తాం అంటూ మహేష్ అండ్ టీం త్రివిక్రమ్‌కు చెప్పారట.
అందుకే ‘బ్రహ్మోత్సవం’ బరిలో లేదని తన ‘అ ఆ’ చిత్రాన్ని రంగంలోకి దింపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.నితిన్, సమంత జంటగా తెరకెక్కిన ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ నటించింది.
ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.భారీ అంచనాలున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.







