మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘కత్తి’ సినిమా రీమేక్ కథ వివాదాస్పదం అయిన విషయం తెల్సిందే.ఈ కథ తనది అంటూ ఒక రచయిత ఫిర్యాదు చేయడంతో రీమేక్‌కు సహాయ నిరాకరణ చేయాల్సిందిగా దాసరి నారాయణ రావు అన్ని విభాగాలకు తెలియజేశాడు.
దాంతో సదరు రచయితతో కాంప్రమైజ్ అయ్యారు.తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం సదరు కథా రచయితకు 40 లక్షలు ఇచ్చి కథపై హక్కులు తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.
దాంతో ఈ వివాదంకు స్వస్థి చెప్పినట్లయ్యింది.
తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘కత్తి’ చిత్రం రీమేక్ తెలుగులో వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే.
గత కొన్ని సంవత్సరాలుగా చిరంజీవి సినిమా కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇటీవలే ఈయన ‘బ్రూస్‌లీ’ చిత్రంలో చిన్న పాత్రలో కనిపించిన విషయం తెల్సిందే.
ఆ సినిమాలో చిరు కనిపించింది కొన్ని సెకన్లే అయినా కూడా చిరు లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.దాంతో పూర్తి స్థాయి సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
వివాదం తొలగి పోవడంతో వచ్చే నెలలో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయని అంటున్నారు.







