మాజీ పోర్న్‌స్టార్ సన్నీలియోన్ ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుసగా చిత్రాలు చేస్తూ దూసుకు పోతున్న విషయం తెల్సిందే.దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న ఈ అమ్మడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలుగు ప్రేక్షకులకు దిమ్మ తిరిగే ఒక విషయాన్ని చెప్పుకొచ్చింది.
ఈమెకు మోహన్‌బాబు అంటే ఇష్టమట, ఆయనతో కలిసి నటించాలనే కోరిక ఈమెలో చాలా కాలంగా ఉందట.ఈ విషయాన్ని స్వయంగా సన్నీలియోన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
బాలీవుడ్‌లో అమీర్ ఖాన్‌తో నటించాలని ఉందని, కోలీవుడ్‌లో సూపర్ స్టార్ రజినీకాంత్‌తో నటించాలని ఉందని చెప్పిన సన్నీలియోన్ టాలీవుడ్‌లో మాత్రం మహేష్‌బాబు, పవన్ కళ్యాణ్ మొదలగు స్టార్ యంగ్ హీరోలను పక్కకు పెట్టి మోహన్‌బాబుతో రొమాన్స్‌ను కోరుకుంటుంది.మోహన్‌బాబు తనయుడు మంచు మనోజ్ హీరోగా నటించిన ‘కరెంట్ తీగ’ చిత్రంలో ఈ అమ్మడు ముఖ్య పాత్రలో నటించిన విషయం తెల్సిందే.
ఆ సినిమా సమయంలోనే ఈమెకు మోహన్‌బాబు గురించిన విషయాలు తెలిశాయట.దాంతో అప్పటి నుండి కూడా ఆయనతో ఒక్క సినిమాలో అయినా నటించాలని ఈమె కోరుకుంటుందట.
మరి సన్నీలియోన్ కోరికను మోహన్‌బాబు తీర్చుతాడా లేదా అనేది చూడాలి.







