తెలుగు చలన చిత్ర రారాజు ఎస్ఎస్ రాజమౌళిని తగిన విధంగా సత్కరించింది భారత ప్రభుత్వం.పద్మ అవార్డులను ప్రకటిస్తూ మన జక్కనకి పద్మశ్రీ పురస్కారాన్ని బహుకరించింది.
ఈ తరం దర్శకులలో ఈ గౌరవం దక్కించుకున్నది రాజమౌళి మాత్రమె.ఈ విషయం పట్ల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది.
అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ తో పాటు రామోజీ గ్రూప్స్ అధ్యక్షుడు రామోజిరావులకు పద్మవిభూషణ్ ప్రకటించారు.ఇక మన హైదరాబాద్ క్రీడాకారులు, తమ క్రీడారంగాల్లో అగ్రశ్రేణి క్రీడాకారిణులుగా వెలుగొందుతున్న సైనా నెహ్వాల్, సానియా మిర్జాలకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది ప్రభుత్వం.
ఇప్పటికే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా అందరి మన్ననలు అందుకుంటున్న సానియా మిర్జా మేడలో మరో ఆభరణంగా చేరింది ఈ పురస్కారం.
అయితే కైకాల సత్యనారాయణ, రాజేంద్రప్రసాద్, జయసుధ , చంద్రమోహన్ వంటి గొప్ప నటులకి ఈసారి పద్మ పురస్కారాలలో స్థానం దక్కపోవడం శోచనీయం.







