టీడీపీ - బీజేపీ లని విడదీస్తున్న కెసిఆర్ ?

అధికారం లోకి వచ్చింది తొలిసారి అయినా కూడా రాజకీయంగా చాలా దూకుడు మీద ఉన్నారు కెసిఆర్.ఆయన గేమ్ ప్లాన్ కి అందరూ లోంగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.

చివరకి రాజకీయ చతురుడు చంద్రబాబు కూడా ఇందులో దాసోహం అయ్యారు.రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సయోధ్య వుండాలనే ఆలోచనను కొత్తగా తెరపైకి తీసుకొస్తోంది టీఆర్‌ఎస్‌.

వాస్తవానికి ఇద్దరు చంద్రుల కలయిక రెండు తెలుగు రాష్ట్రాలకూ మేలు చేసేదే.అయితే ఈ కలయిక రాజకీయ కోణంలో జరుగుతుండడమే ఇక్కడ కీలకాంశం.

మొదట స్నేహ హస్తం చంద్రబాబు వైపు నుంచి వచ్చినా దాన్ని కెసిఆర్ తోసిపుచ్చారు తరవాత గ్రేటర్ ఎన్నికల నేపధ్యంలో ముందస్తు వ్యూహంతో చంద్రబాబు ని ప్రసన్నం చేసుకున్నారు.చండీయాగం , శంకుస్థాపన లాంటివి అడ్డం పెట్టుకుని కలిసిపోయారు ఇద్దరూ.

Advertisement

దీంతో ఈ దెబ్బతో తెలంగాణా టీడీపీ జనాలు అంతా కన్ఫ్యూజన్ లో పడిపోయారు.చంద్రబాబే తెలంగాణా లో పార్టీ ని బలోపేతం చెయ్యడం లో సీరియస్ గా లేనప్పుడు తమకేంటి అన్నట్టు ఉన్నారు వారంతా.

ఈ కలయిక కి రేవంత్ రెడ్డి అసలు నచ్చలేదు అంటున్నారు.అంతరార్థం ఇదేనట.

అయితే ఈ కలయికను టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అస్సలేమాత్రం ఇష్టపడటంలేదు.ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కలయికను వ్యతిరేకించబోం.

అయితే, టీడీపీ క్యాడర్‌ని చంద్రబాబు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పాదాల వద్ద పెట్టడం అనేది జరగదు." అంటున్నారు ఆయన.ఏదేమైనా టీడీపీ ని చూస్తుంటే బీజేపీ కి కూడా కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి.టీడీపీకి ఓటేస్తే, అది టీఆర్‌ఎస్‌ ఖాతాలోకే వెళుతుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు

అంటూ చేస్తున్న ప్రచారమూ టీడీపీని దెబ్బతీయడంతోపాటు, టీడీపీ - బీజేపీ సంబంధాల్ని దెబ్బతీసేలా వుంది.

Advertisement

తాజా వార్తలు