సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం’.శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ప్రసాద్ వి పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు మహేష్‌బాబు సైతం ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.దాంతో మహేష్‌బాబు ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి ఫ్యామిలీ కథాశంతో ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కిస్తున్నట్లుగా ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.
ఈ సినిమాలో మహేష్‌బాబుకు జోడీగా ముద్దుగుమ్మ ముద్దుగుమ్మలు మొదటి సారి నటించడంతో పాటు, మొదటి సారి మహేష్‌బాబు కూతురు సితార ఈ సినిమాలో వెండి తెరపై కనిపించబోతుంది.
దాంతో అంచనాలు ఇప్పటికే తారా స్థాయికి వెళ్లాయి.ఇక ఈ సినిమా ఫస్ట్‌లుక్ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం ఊటీలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1న విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.అదే విధంగా సంక్రాంతికి చిన్న టీజర్‌ను సైతం విడుదల చేసేందుకు దర్శకుడు ఏర్పాట్లు చేస్తున్నాడు.
భారీ అంచనాలున్న ఈ సినిమాను వచ్చే ఏప్రిల్‌లో విడుదల చేయనున్నారు.సమంత, కాజల్, ప్రణీతలు ఈ సినిమాలో హీరోయిన్స్‌గా నటించనున్నారు.







