దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను అందుకున్నాడు.‘కుమారి 21ఎఫ్’ ఇచ్చిన సక్సెస్ జోష్‌తో ఇకపై సుకుమార్ వరుసగా సినిమాలను నిర్మించాలని భావిస్తున్నాడు.
‘కుమారి 21ఎఫ్’ చిత్రంతో సుకుమార్ ఏకంగా 10 కోట్ల లాభాలను దక్కించుకున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ఈ సినిమాలో రాజ్ తరుణ్ మరియు హెబ్బా పటేల్‌ల రొమాన్స్‌కు యూత్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు.
దాంతో సినిమాకు విపరీతమైన కలెక్షన్స్ వస్తున్నాయి.
నిర్మాతకు తనకు మంచి సక్సెస్‌ను తెచ్చి పెట్టిన కుమారిని సుకుమార్ వదలాలని అనుకోవడం లేదు.
త్వరలో ఈయన నిర్మించబోతున్న మరో సినిమాలో కూడా కుమారి అలియాస్ హెబ్బా పటేల్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నాడు.తన మేనల్లుడు అశోక్ హీరోగా ఒక సినిమాను నిర్మించేందుకు సుకుమార్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు.
కథ మరియు స్క్రీన్‌ప్లే అందించి తన శిష్యుని దర్శకత్వంలో అశోక్ హీరోగా హెబ్బా పటేల్ హీరోయిన్‌గా సుకుమార్ సినిమాను ప్రారంభించబోతున్నాడు.వచ్చే సంవత్సరం ఆరంభంలో ఆ సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సుకుమార్‌కు మరోసారి కుమారి సక్సెస్‌ను తెచ్చి పెడుతుందేమో చూడాలి.







