పట్టు వదలని విక్రమార్కుడు

విక్రమార్కుడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆయన అనుకున్నది సాదించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు.

 Brahmanandam Son Gautam Next Movie Updates-TeluguStop.com

అదే విధంగా బ్రహ్మానందం నట వారసుడు గౌతం కూడా పట్టు వదలని విక్రమార్కుడిగా సినిమాల్లో సక్సెస్‌ను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.ఈయన మొదటి సినిమా వచ్చి దాదాపు 10 సంవత్సరాలు అయ్యింది.

అయినా ఇప్పటి వరకు ఈయన నటించిన సినిమాలు ఒక్కటి కూడా సక్సెస్‌ అవ్వలేదు.సక్సెస్‌ రావట్లేదనే ఉద్దేశ్యంతో ఈయన చాలా అరుదుగా సినిమాలు చేస్తున్నట్లుగా అనిపిస్తోంది.

ఈయన చివరి చిత్రం ‘బసంతి’.అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈయన మరో సినిమాను విడుదల చేసింది లేదు.

‘బసంతి’ వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్న తరుణంలో తాజాగా గౌతం మరో సినిమాకు ఓకే చెప్పాడు.రమేష్‌ దర్శకత్వంలో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఒక ప్రేమ కథా చిత్రంలో నటించేందుకు గౌతం రెడీ అవుతున్నాడు.

కొత్త లుక్‌లో కనిపించేందుకు గౌతం ప్రయత్నాలు చేస్తున్నాడు.ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్‌ మొహం చూసి తీరాలనే పట్టుదలతో గౌతం ఉన్నాడు.

బ్రహ్మానందంకు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పరిచయాల కారణంగా ‘బసంతి’ సినిమాకు భారీ పబ్లిసిటీని తెచ్చారు.కాని అది ఫ్లాప్‌ అయ్యింది.

దాంతో ఈసారి ఎలాంటి హంగామా లేకుండా సినిమాను విడుదల చేయాలని గౌతం అండ్‌ టీం చూస్తోంది.గౌతం ఇప్పటికి అయినా సక్సెస్‌ను దక్కించుకుని తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడా అనేది ఆసక్తికర అంశం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube