టాలీవుడ్ బ్యాచిలర్ హీరోలు ఒక్కరొక్కరుగా పెళ్లి పీఠలు ఎక్కేస్తున్నారు.గత కొంత కాలంగా నాగచైతన్య పెళ్లి గురించిన వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెల్సిందే.
ఆయన పెళ్లిపై అతి త్వరలో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.నాగచైతన్య ఈనెల 23న రాబోతున్న తన పుట్టిన రోజున తాను పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రకటించనున్నాడు అంటూ ఫ్యాన్స్‌కు సమాచారం అందింది.
నాగచైతన్య కుటుంబం నుండి చైతూ ప్రేమ పెళ్లికి ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ వచ్చింది.దాంతో తన మనస్సుకు నచ్చిన ఒక అమ్మాయిని తాజాగా చైతూ ఎంపిక చేసుకున్నాడని, ఆమెతో కొన్ని రోజులుగా ట్రావెల్ చేస్తున్నట్లుగా సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ బర్త్‌డేకు ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్లుగా చైతూ ప్రకటించే అవకాశాలున్నాయి.
ఇక ప్రస్తుతం నాగచైతన్య ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.
గౌతం మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ చిత్రం వచ్చే నెలలో విడుదల కాబోతుంది.ఆ వెంటనే మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘ప్రేమమ్’ రీమేక్‌లో చైతూ నటించబోతున్నాడు.
ఈ రెండు చిత్రాలు పూర్తి చేసి చైతూ పెళ్లి చేసుకునే అవకాశాలున్నాయి.







