రాహుల్ గాంధీకి టైం వచ్చింది.తొందరగా ఆ కార్యక్రమం చేసేయాలి అంటున్నారు కొందరు కాంగ్రెస్ నాయకులు.
ఏం కార్యక్రమం? ఆయనకు వివాహం చేయాలని ఆడుతున్నారా? ఒకప్పుడు అడిగారు.కానీ ఇప్పుడు దాన్ని గురించి పెద్దగా అడగడం లేదు.
పెళ్లి విషయంలో రాహుల్ గాంధీయే ఏమీ మాట్లాడటం లేదు.కాబట్టి నాయకులు ఏం అడుగుతారు? ఇప్పుడు సమయం వచ్చింది అని చెప్పేది పెళ్ళికి కాదు.కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంటుగా పగ్గాలు చేపట్టడానికి.వచ్చే ఏడాది అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.కాబట్టి రాహుల్ పగ్గాలు తీసుకోవాలని, అందుకు ఇదే సరైన సమయం అని పార్టీ రాజస్థాన్ అధ్యక్షుడు సచిన్ పైలట్ అన్నారు.బీహార్ ఎన్నికల్లో పార్టీ 40 సీట్లకు పోటీ చేసి 27 సీట్లు సాధించింది.
ఆ ఘనత రాహుల్కే చెందుతుందని నాయకులు యమ పొగుడుతున్నారు.బీహార్ ఎన్నికల్లో పార్టీ వ్యూహాలను యువరాజే రూపొందించారని అంటున్నారు.
ఉపాధ్యక్షుడిగా ఉండగానే ఇంత బాగా చేస్తే పూర్తి బాధ్యతలు ఇస్తే ఇంకా బాగా చేస్తాడని చెబుతున్నారు.గతంలో సోనియా గాంధి అధ్యక్ష పదవిని ఏడాది పొడిగించారు.
ఆ గడువు కూడా దగ్గర పడుతున్నది.కాబట్టి కుమారుడికి పగ్గాలు ఇవ్వాలని నాయకులు వేడుకుంటున్నారు.







