కష్టంగా అనిపించినా, అజిత్ సినిమా ” వేదాలమ్” యూనిట్ కి శృతి హాసన్ బై బై చెప్పక తప్పలేదు.ఇంతకీ ఎందుకు బై చెప్పింది అని అనుకుంటున్నారా.
మీరూ ఊహించుకున్నట్టు యూనిట్ లో ఎటువంటి గొడవలు జరగలేదు.శృతి హాసన్ అజిత్ మధ్య ఎటువంటి విభేదాలు లేవు.
అజిత్ హీరోగా నిర్మాత ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్న మూడవ చిత్రం వేదాళమ్.ఇంతకు ముందు ఆరంభం, ఎన్నై అరిందాల్ వంటి విజయవంతమైన చిత్రాలు వీరి కలయికలో వచ్చాయి.
శివ దర్శకత్వం వహిస్తున్న “వేదాలమ్” శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ చిత్రానికి సంబంధించి శ్రుతిహాసన్ తను నటించాల్సిన సన్నివేశాలను పూర్తి చేసేసింది.
ఏంతో సరదాగా గడిచిన షూటింగ్ ని తలచుకొని శృతి బాధపడిందట.అందుకే అతి కష్టం మీద యూనిట్ కి బై బై చెప్పేసి వెళ్ళిపోయింది.
నిన్న విడుదలైన వేదాలమ్ టీజర్ యుట్యూబ్ రికార్డులను తిరగరాస్తూ వేశేష ఆదరణ పొందుతోంది.ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.







