ఆహ్వానితుల జాబితాలో తెలంగాణా సీఎమ్

ఆంధ్రా రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించే ప్రముఖుల జాబితాలో తెలంగాణా ముఖ్యమంత్రి కెసీఆర్ కూడా ఉన్నట్లు సమాచారం.ఇది వంద శాతం నిజమై ఉంటుంది.

 Naidu To Invite Cm Kcr For Amaravati Fete-TeluguStop.com

ఆహ్వానితుల్లో కెసీఆర్ ఉండాలి కూడా.పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి, అందులోనూ తెలుగువాడు.

మొన్నటివరకు ఉమ్మడి రాష్ట్రంలోని నాయకుడు.కాబట్టి ఆయన్ను ఆహ్వానించడం సమంజసం.

వస్తాడా రాదా అనేది తరువాతి విషయం.కెసీఆర్ మీద మనసులో కోపం పెట్టుకొని పిలవకపోతే అది చంద్రబాబు తప్పవుతుంది.

కాబట్టి పిలవక తప్పదు.కెసీఆర్ కూడా గౌరవంగా వెళితేనే బాగుంటుంది.

చంద్ర బాబు ముందుగా కేసీఆర్కు ఆహ్వాన పత్రిక పంపి, తరువాత ఫోన్ చేసి ఆహ్వానిస్తారని సమాచారం.కాని బాబు స్వయంగా వచ్చి పిలిస్తే మంచిది.

సింగపూర్ వెళ్లి అక్కడి ప్రధానిని పిలిచారు.ధిల్లీ వెళ్లి ప్రధాని మోడీని పిలిచారు.

కేసీఆర్ను కూడా అలాగే పిలవాలి కదా.అందులోనూ ఉమ్మడి రాజధాని అనే బంధం ఇంకా కొనసాగుతూనే ఉంది.బాబుకు వ్యక్తిగతంగా, ప్రభుత్వపరంగా అనేక లింకులు హైదరాబాదుతో ఉన్నాయి.అనేకమంది ముఖ్యమంత్రులను బాబు ఆహ్వానిస్తున్నారు.ప్రస్తుతం బాబు, కెసీఆర్ మధ్య సంబంధాలు లేవు.నోటుకు ఓటు కుంభకోణం బయటపదినప్పటినుంచి ఇద్దరు ఇప్పటివరకు కలుసుకోలేదు.

కాబట్టి కెసీఆర్ శంకుస్థాపన కార్యక్రమానికి పోవడం అనుమానమేనని కొందరు నాయకులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube