ఏదైనా సినిమా నచ్చితే దాన్ని ట్విట్టర్ లో మెచ్చుకోవడం, లేదంటే హీరో కి కాని, డైరెక్టర్ కి కాని ఫోన్ చేసి అభినందించటం సూపర్ మహేష్ కి ఉన్న మంచి అలవాటు.కేవలం తెలుగు వరకే కాదు.
హిందీ, తమిళ సినిమాలు కుడా చూసే సూపర్ స్టార్ .ఏ భాషలో ఏ సినిమా నచ్చిన అభినందిస్తూ ఉంటాడు.ఇప్పుడు మహేష్ మెసేజ్ చేసి మెచ్చుకోవడంతో ఆనందంతో ఊగిపోతున్నాడు ఓ తమిళ హీరో.మహేష్ కూడా ఓ సినిమా రీమేక్ చేయబోతున్నాడని, మహేష్-రామ్ చరణ్ ల మధ్య ఆ సినిమా రీమేక్ హక్కుల కోసం పోటి జరుగుతుందని, మొన్నామధ్య గాలి వార్తలు వచ్చాయి గుర్తున్నాయి కదా … తని ఒరువన్ ఆ సినిమా పేరు.
ఆ సినిమాను నిజంగానే మహేష్ చూసాడు .కాని రీమేక్ చేద్దామని కాదు.సినిమా బాగా నచ్చిందట మహేష్ కి .వెంటనే ఆ సినిమా హీరో జయం రవి కి సినిమాను, తన అభినయాన్ని అభినందిస్తూ మెసేజ్ చేసాడని సినివర్గాల సమాచారం.ఈ విషయాన్ని జయం రవి తన మిత్రులకు పదే పదే చెబుతూ సంబరపడిపోతున్నాడట.







