మధ్యప్రదేశ్‌లో బాంబు పేలుళ్లు

మధ్య్కపదేశ్‌లో ఆదివారం ఉదయం బాంబు పేలుళ్లు సంభవించాయి.రాజధాని భోపాలకు మూడొందల కిలోమీటర్ల దూరంలోని పట్లవాడ బస్‌స్టాండ్‌ వద్ద ఉన్న రెస్టారెంటులో ఈ ఘటన సంభవించింది.

ఇరవై మంది గాయపడ్డారని, వారి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.ఈ పేలుళ్లు గిలిటిన్‌ స్టిక్కుల కారణంగా సంభవించాయని కొందరు చెబుతున్నారు.

అత్యంత జనసమ్మర్థం గల ప్రాంతంలో ఉన్న ఈ రెస్టారెంటుకు ఉదయమే అల్పాహారం కోసం అనేకమంది వస్తుంటారు.ఆ సమయంలో పేలుడు సంభవించడంతో చాలామంది గాయపడ్డారు.

ఎవరైనా మరణించారా అనేదానిపై సరైన సమాచారం లేదు.ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా ఒక మంత్రిని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Advertisement

అధికారులు కూడా వెంటనే తరలి వెళ్లారు.రాజధానిలో ప్రపంచ హిందీ మహాసభల వ్యవహారాలు చూసుకుంటున్న ప్రిన్సిపల్‌ కార్యదర్శిని వెంటనే ఘటనా వెళ్లాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు.

దీనిపై దర్యాప్తు చేయిస్తామన్నారు.రాష్ర్ట హోం మంత్రి బాబూలాల్‌ గౌర్‌ వెంటనే ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు.

సహాయక చర్యల్లో పాల్గొనడానికి నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్‌్స ఫోర్‌్స బయలుదేరి వెళ్లింది.ఇది ఉగ్రవాదుల చర్చా? మరేదైనా ప్రమాదమా? అనేది స్పష్టంగా తెలియదు.ఈ విషయం దర్యాప్తులో బయటపడాల్సిందే.

కొన్నాళ్లుగా ఉగ్రవాదులు బెదిరిస్తున్న సంగతి తెలిసిందే.ఇంతకాలం పెద్ద నగరాల్లో బాంబు పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు ఇప్పుడు మారుమూల ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నారా? ఏది ఏమైనా ఈ పేలుళ్ల విషయంలో సమగ్ర దర్యాప్తు జరగాల్సిందే.ఒకవేళ ఉగ్రవాదులు పనే అయుంటే మారుమూల ప్రాంతాల్లోనూ నిఘా పెంచాల్సిందే.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు