చరణ్‌కు డీవీడీ పంపిన పవన్‌!

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌ ఆరంభంలో మార్షల్‌ ఆర్ట్స్‌ను నేరుకున్న విషయం తెల్సిందే.ఇప్పటికి కూడా పవన్‌కు మార్షల్‌ ఆర్ట్స్‌ అంటే చాలా ఆసక్తి.

 Pawan Sent A Stunts Dvd For Charan-TeluguStop.com

ఆ ఆసక్తితోనే ప్రపంచ అత్యుత్తమ మార్షల్‌ ఆర్ట్స్‌ వీడియోలను ఈయన సేకరించాడు.తాజాగా ఆ వీడియోలను కలిగిన ఒక డీవీడీని చరణ్‌కు అందించినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం చరణ్‌ చేస్తున్న సినిమాకు ఆ వీడియోలు ఉపయోగమనే ఉద్దేశ్యంతో పవన్‌ ఆ వీడియో డీవీడీని పంపించాడు.

ప్రస్తుతం చరణ్‌ ‘బ్రూస్‌లీ’ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.

చరణ్‌ ఈ సినిమాలో ఫైట్‌ మాస్టర్‌గా కనిపించనున్నాడు.మార్షల్‌ ఆర్ట్స్‌ను కూడా చరణ్‌ ఈ సినిమాలో చూపించనున్నాడు.

అందుకే పవన్‌ తనకు తెలిసిన, తన వద్ద ఉన్న మార్షల్‌ ఆర్ట్స్‌ సమాచారాన్ని అబ్బాయి చరణ్‌కు ఇచ్చాడు.బాబాయి అభిమానంతో ఇచ్చిన డీవీడీ చరణ్‌కు చాలా ఉపయోగపడ్డట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులతో పాటు, మెగా సన్నిహితులు చెబుతున్నారు.

మెగా ఫ్యామిలీ హీరోల మధ్య విభేదాలు ఉన్నాయి అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొన్నాళ్ల క్రితం బాబాయి పవన్‌ నిర్మాణంలో తాను ఒక సినిమాలో నటించబోతున్నట్లుగా చరణ్‌ ప్రకటించిన విషయం తెల్సిందే.అలాగే చిరు 150వ సినిమాలో కూడా పవన్‌ గెస్ట్‌ రోల్‌లో కనిపించే అవకాశాలున్నాయని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube