ఎన్నో సక్సెస్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన తేజ గత కొంత కాలంగా సక్సెస్ కోసం పరితపిస్తున్నాడు.ఈయన ఏ సినిమా చేసినా కూడా ప్రేక్షకులు తిరస్కరిస్తూనే ఉన్నారు.
తాజాగా ఎంతో నమ్మకం పెట్టుకుని, తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకంతో తెరకెక్కించిన చిత్రం ‘హోరా హోరీ’.‘జయం’, ‘నువ్వు నేను’ తరహాలో ఈ సినిమా కూడా యూత్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడం ఖాయం అని తేజ ఊహించాడు.
కాని ఫలితం తారు మారు అయ్యింది.తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లుగా తేజ ఊహించని ఫలితం రావడంతో దిమ్మ తిరిగి పోయే షాక్ తగిలింది.
‘హోరా హోరీ’ ఫలితంతో టాలీవుడ్‌లో తేజ సమయం ముగిసిందని, ఇక తేజ సినిమాలు తీయకుండా ఖాళీగా ఉండటం మంచిది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ఇప్పటి వరకు ఆయన దక్కించుకున్న విజయాల తాలూకు క్రేజ్ ఇప్పుడు వరుస ఫ్లాప్‌లతో పోతోంది.
దాంతో తేజ మంచి పేరుతోనే ఉండాలంటే ఇకపై సినిమాలు తీయకుంటేనే బెటర్ అని విశ్లేషకులు అంటున్నారు.మరి తేజ ఆ మాట విని సినిమాలకు దూరంగా ఉంటాడో లేక మళ్లీ చేతులు కాల్చుకుంటాడో చూడాలి.







