రాజకీయ నాయకులకు పంట పండటం అంటే పదవి దక్కడం అన్న మాట.పదవులు దక్కక పొతే వారు పార్టీలు మారతారు.
కాబట్టి వారికి ఏదో ఒక పదవి ఇవ్వాలి.అనుకున్న పదవి దొరికితే పంట పండినట్లే.
ప్రస్తుతం తెలంగాణా టీడీపీ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు పంట పండే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.కేంద్రంలో భాజపా, ఆంధ్రాలో టీడీపీ అధికారంలోకి రాగానే తెలంగాణా టీడీపీలో బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడైన మోత్కుపల్లి నరసింహులుకు గవర్నర్ పదవి ఇప్పిస్తానని చంద్రబాబు మాట ఇచ్చారు.
కాని ఇప్పటివరకు అనుకున్న పని కాలేదు.పార్టీ మహానాడులో కూడా మోత్కుపల్లి ఈ విషయం బాబుకు గుర్తు చేసారు.
మోత్కుపల్లికి గవర్నర్ పదవి ఇవ్వబోతున్నారని బాగా ప్రచారం కూడా జరిగింది.దీంతో ఆయన చాలా ఆశలు పెట్టుకున్నారు.
పదవి రాకపోతే గులాబీ పార్టీలోకి పోతాడని ప్రచారం జరిగింది.మోత్కుపల్లికి పదవి విషయం బాబు కేంద్రానికి ప్రధానంగా హోం మంత్రి రాజ్నాథ్ సింగుకు చాలాసార్లు గుర్తు చేసారు.
చివరకు ఆయన ప్రయత్నం ఫలించినట్లు కనబడుతున్నది.భాజపా తన మిత్ర పక్షాలైన టీడీపీ, శివసేన, అకాలీదళ్ పార్టీలకు ఒక్కో గవర్నర్ పోస్టు ఇవ్వాలని అనుకున్నది.
అందులో భాగంగా మోత్కుపల్లిని కేరళకు పంపుతారని సమాచారం.తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ను కూడా మారుస్తారని అంటున్నారు.
అనుకున్న విధంగా జరిగితే మోత్కుపల్లికి పదవి వచ్చినట్లే.







