జయసూర్యపై ‘లింగ’ ఎఫెక్ట్‌

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ హీరోగా నటించిన ‘లింగ’ చిత్రం డిజాస్టర్‌ ఫలితాన్ని చవి చూసిన విషయం తెల్సిందే.ఈ సినిమా పంపిణీ హక్కులను తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు నిండా మునిగి పోయారు.

 Rajini Lingaa To Affect Vishal Jaya Surya-TeluguStop.com

నిర్మాత మాత్రం లాభాలను మూట కట్టుకున్నాడు.అప్పటి నుండి కూడా డిస్ట్రిబ్యూటర్లు తమకు న్యాయం చేయాల్సిందిగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.

రజినీకాంత్‌ సాయం చేసేందుకు ముందుకు వచ్చినా కూడా డిస్ట్రిబ్యూటర్లు శాంతించలేదు.తాజాగా ‘లింగ’ చిత్ర నిర్మాత నిర్మించిన ‘పాయిం పులి’ చిత్రం విడుదల కాబోతుంది.

తమకు న్యాయం చేసే వరకు ‘పాయం పులి’ చిత్రాన్ని విడుదల కానిచ్చేది లేదు అంటూ డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చేస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా పంపిణీ హక్కులు తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు సైతం ఈ సినిమా విడుదల చేసేందుకు ముందుకు రావడం లేదు.

దాంతో వచ్చే నెలలో విడుదల కావాల్సిన ఈ సినిమా విడుదల అయ్యేనా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.తెలుగులో ఈ సినిమా ‘జయసూర్య’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

విశాల్‌, కాజల్‌ జంటగా నటించిన ఈ సినిమాకు సుశీంద్రన్‌ దర్శకత్వం వహించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube