టాలీవుడ్‌లో ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ లక్కీ బ్యూటీగా దూసుకు పోతుంది.స్టార్ హీరోల అందరితో కూడా వరుస పెట్టి సినిమాలు చేసేందుకు రెడీ అవుతోంది, ఇప్పటికే కొందరు స్టార్ హీరోలతో సినిమాలు కూడా చేసేసింది.ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్‌బాబు వంటి స్టార్ హీరోలతో నటిస్తున్న ఈ అమ్మడు నెం.1 స్థానం వైపు దూసుకు పోతుంది.ఇక ఇదే దారిలో రెజీనా కూడా అడుగులు వేస్తున్నట్లుగా అనిపిస్తోంది.
మెగా హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు తాజాగా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ మూవీలో సాయిధరమ్ తేజ్ సరసన నటించింది.
తాజాగా విడుదలైన ట్రైలర్‌లో ఈ అమ్మడు అందంతో పాటు నటనతో కూడా ఆకట్టుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.భారీ అంచనాలున్న ‘సుబ్రమణ్యం…’ సినిమా సక్సెస్ అయితే రెజీనాకు కూడా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు రావడం ఖాయం అని విశ్లేషకులు అంటున్నారు.
రకుల్, రెజీనాలు ఇండస్ట్రీకి దాదాపుగా ఒకే సమయంలో వచ్చారు.అయితే ఇప్పటికే రకుల్ దూసుకు పోతుండగా, రెజీనా కాస్త స్లోగా ఉంది.ఈమె త్వరలోనే రకుల్‌కు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం అని అంటున్నారు.







